మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ అంటేనే మాస్ ఫ్రెంజీకి పరాకాష్ట. ఇప్పుడు SSMB29 గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ చుట్టూ ఉన్న హడావుడి చూస్తే, ఇది సాధారణం కాదని స్పష్టంగా తెలుస్తోంది.

సాధారణంగా సినిమాలు పూజా కార్యక్రమం లేదా ప్రెస్ మీట్‌తో ప్రారంభమవుతాయి. కానీ మహేష్ బాబు – రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ SSMB29 మాత్రం దానికి పూర్తి భిన్నంగా, ఒక గ్రాండ్ లెవెల్ లాంచ్ ఈవెంట్ ద్వారా పబ్లిక్‌కి పరిచయమవుతోంది.

ఈ ఈవెంట్‌ని చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే అంటున్నారు ఇండస్ట్రీ టాక్. ప్రీ-రిలీజ్ ఈవెంట్ స్థాయిలో భారీ ప్రణాళికలతో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో సినిమా టైటిల్, రిలీజ్ డేట్‌తో పాటు చాలా మంది ఎదురుచూస్తున్న గ్లింప్స్ వీడియో కూడా విడుదల కానుంది.

తేదీ ఫిక్స్! – నవంబర్ 16

మేకర్స్‌ ఈ హిస్టారిక్ ఈవెంట్‌కి రామోజీ ఫిల్మ్ సిటీ (RFC) ని ప్రధాన వేదికగా పరిశీలిస్తున్నారు. మరో రెండు లొకేషన్లు కూడా చర్చలో ఉన్నాయని సమాచారం. ఈ వారంలోనే ఫైనల్ లొకేషన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.

3 మేజర్ అనౌన్స్‌మెంట్స్ ఒకే ఈవెంట్‌లో!

సినిమా టైటిల్

రిలీజ్ డేట్

గ్లింప్స్ రిలీజ్

ఇంత పెద్ద స్థాయిలో అనౌన్స్‌మెంట్ ప్లాన్ చేయడం ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పాలి.

హాలీవుడ్‌లో సిమల్టేనియస్ రిలీజ్ ప్లాన్!
ఇది మొదటిసారిగా ఒక భారతీయ చిత్రం హాలీవుడ్ మార్కెట్లలో సిమల్టేనియస్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. ప్రస్తుతం టార్గెట్ రిలీజ్ మార్చ్ 2027గా పెట్టారు.

సినిమా టైటిల్ గురించి “వారణాసి”, “Gen 63” వంటి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అసలైన టైటిల్ ఏమిటో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ అవుతుందా SSMB29 గ్లింప్స్ లాంచ్?
నవంబర్ 16న దానికి సమాధానం రాబోతోంది!

, , , , ,
You may also like
Latest Posts from