ఈ మధ్యకాలంలో కామెడీకి కేరాఫ్ ఎడ్రస్ గా నిలుస్తున్న శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎంతో కష్టపడి సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు సక్సెస్‌లు మాత్రం అందుకోలేపోతున్నాడు. ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘సింగిల్’ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
గీతా ఆర్ట్స్ సమర్పణలో, కాల్య ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ విడుదలైంది. ఎంటర్టైన్మెంట్ కు న్యూ డోస్ ఇవ్వబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
అయితే ఈ ట్రైలర్‌లో వినిపించిన కొన్ని డైలాగ్స్ ప్రస్తుతం డిస్కషన్ గా మారాయి. ముఖ్యంగా ‘శివయ్యా’, ‘మంచు కురిసిపోవడం’ లాంటి పదాలు మంచు విష్ణుని హర్ట్ చేశాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అందుకు కారణం మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘శివయ్యా’ అనే ఓ డైలాగ్ వుంది. దాన్ని చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. అదే రిథమ్ లో ‘సింగిల్’లో వాడాడు శ్రీవిష్ణు.
‘మంచు కురిసిపోవడం’ అనే మరో డైలాగ్ వుంది. ‘మంచు’ అనే పదం మరో అర్థంలో వినిపిస్తుంటుంది. ఇవి రెండూ విష్ణుని హర్ట్ చేశాయని, అందుకే ఛాంబర్‌లో ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.