మంచు విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్‌కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. మోహన్‌బాబు నిర్మాత. ప్రీతి ముకుందన్ హీరోయిన్. ఏప్రిల్ 25న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో రుద్ర పాత్రలో ప్రభాస్ కనిపించనున్న విషయం తెలిసిందే. అలాగే ప్రభాస్ ‘స్పిరిట్’ (Spirit) లోనూ తాను నటించాలనుకుంటున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు.
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ (Spirit) చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. పవర్‌ఫుల్ పోలీస్ డ్రామాగా ఇది సిద్ధం కానుంది. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో నటించేందుకు అవకాశం కల్పిస్తూ ఇటీవల చిత్ర టీమ్ ఒక ప్రకటన (Spirit Casting Call) విడుదల చేసింది.
వయసుతో సంబంధం లేదనీ, సినిమా – థియేటర్‌కు సంబంధించి అనుభవం ఉన్నవారు ఆసక్తి ఉంటే అప్లై చేసుకోమని కోరింది. దీనిపై తాజాగా మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. తాను అప్లై చేసినట్లు తెలిపారు. చిత్రబృందం నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని వేచి చూస్తున్నట్లు చెప్పారు.
అభిమానులందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘స్పిరిట్’ గురించి గతంలో సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తొలిరోజే ఇది రూ.150కోట్లు వసూళ్లు చేయడం ఖాయమని అన్నారు. ‘
స్పిరిట్’లో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపిస్తారని చెప్పారు. గత 24 సినిమాల్లో ప్రేక్షకులు ఆయన్ని ఒక విధంగా చూశారని.. ఈ చిత్రంలో మరో స్థాయిలో చూస్తారని హామీ ఇచ్చారు. ప్రభాస్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని ప్రశంసించారు. ఆయన్ని చూపించే విధానం ఆడియన్స్‌కు నచ్చితే చాలు.. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు.