ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత త్రినాథరావు నక్కిన చేస్తున్న చిత్రం కావడం.. సందీప్ కిషన్ మంచి ఫాంలో ఉన్నప్పుడు చేసిన సినిమా కావడంతో మజాకా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని అర్థం అయింది. అయితే సినిమా రిలీజ్ తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. ఓపినింగ్స్ బాగానే ఉన్నా కలెక్షన్స్ మాత్రం నమోదుకావటం లేదు.
మజాకా(Mazaka Movie)సినిమా….రెండో వీక్ లో అడుగు పెట్టింది. కొత్త సినిమాల వలన థియేటర్స్ కౌంట్ ను తగ్గిపోయాయి. ఉన్నంతలో మేజర్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపించేలా షేర్స్ ని సాధిస్తున్నా కూడా బ్రేక్ ఈవెన్ కోసం చాలా కష్టమే అనిపిస్తోంది.
సినిమా మొత్తం మీద 8వ రోజున 17 లక్షల రేంజ్ లో… షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 9వ రోజుకి వచ్చే సరికి….3 లక్షలు డ్రాప్ అయ్యి 14 లక్షల రేంజ్ లో షేర్ వచ్చింది.
9 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్
👉Nizam: 1.83Cr
👉Ceeded: 79L
👉Andhra: 2.14Cr~
AP-TG Total:- 4.76CR(9.20CR~ Gross)
👉KA+ROI+OS : 91L**approx
మొత్తం ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ : 5.67CR(Gross – 11.35CR~)
(50% Recovery)
బాక్స్ ఆఫీస్ దగ్గర 11.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.53 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.