సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా “హిట్ 3” చిత్రానికి సంబంధించి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై వచ్చిన విమర్శలపై స్పందించారు. ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. తన స్కోర్‌ను విమర్శించడంలో కొంతమంది సమీక్షకుల పదాల ఎంపిక అన్యాయంగా ఉందని అన్నారు. కొంతమంది సమీక్షకులు తమ పదాల ఎంపిక ద్వారా తమను తాము పేలవంగా ప్రతిబింబించారని ఆయన అన్నారు.

ఈ సందర్బంగా మిక్కీ తన పనిని సమర్థించుకున్నాడు, తాను తరచుగా సృజనాత్మక రిస్క్‌లను తీసుకుంటాడని పేర్కొన్నాడు, అది ఎల్లప్పుడూ ఫలితం పొందకపోవచ్చు. అయినప్పటికీ, “HIT 3” కోసం తన స్కోర్ సినిమా విజయానికి దోహదపడిందని అతను నమ్ముతున్నాడు.

వాస్తవానికి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ మీద జరిగిన రివ్యూలు, ఆన్ లైన్ విశ్లేషణలు, సోషల్ మీడియా అభిప్రాయాల్లో కాస్త ఎక్కువ ఫోకస్ అయిన విషయం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. నిజానికి ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ ని ఎంచుకోవడం పట్ల ఫ్యాన్స్ మొదట ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఎందుకంటే హ్యాపీ డేస్, శతమానం భవతి లాంటి ఎమోషల్ ఫ్యామిలీ మూవీస్ తో ఎక్కువ దగ్గరైన ఈ సెన్సిబుల్ సంగీత దర్శకుడు ఓవర్ వయొలెన్స్ ఉన్న హిట్ 3కి ఎంత వరకు న్యాయం చేస్తాడనే అనుమాన పడ్డారు. ఇలాంటి ఇంటెన్స్ డ్రామాలకు టెర్రిఫిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పడాలనేది వారి ఉద్దేశ్యం.

దాంతో మిక్కీ జె మేయర్ మీద హిట్ 3 విషయంలో సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తనకిచ్చిన బాధ్యతను వంద శాతం న్యాయం చేకూర్చాడని ఒకరు, లేదు అనిరుద్ తమన్ లాంటి వాళ్ళు అయితే ఇంకా బాగా ఇచ్చేవారని మరొకరు ఇలా చాలా ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు.

ఇవి ఆయన దాకా వెళ్లాయి. ట్విట్టర్ ఎక్స్ వేదికగా సుదీర్ఘంగా ఒక సందేశం పంచుకున్నారు. దర్శకుడు శైలేష్ కొలను కోరినట్టుగా మితిమీరిన శబ్దాలు లేకుండా, సబ్జెక్టు డిమాండ్ చేసిన మేరకు పరిధులు దాటని నేపధ్య సంగీతం ఇచ్చానని, ఇప్పుడు ప్రేక్షకుల ఆదరణ చూసి చాలా సంతోషంగా ఉందని నెగటివిటీ పట్టించుకోనని చెప్పుకొచ్చారు.

, , , ,
You may also like
Latest Posts from