
కామెడీ లేదు, పాటలు లేవు, 3 గంటలు… అయినా సూపర్ హిట్!
రిలీజ్‌కు ముందు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. పోస్టర్లు వచ్చినా, ట్రైలర్ వచ్చినా పెద్ద హంగామా ఏమీ లేదు. కానీ సినిమా రిలీజ్ అయ్యిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్ల బయట చర్చలు, సోషల్ మీడియాలో రివ్యూలు – ధురంధర్ ఒక్కసారిగా హాట్ టాపిక్!
పాకిస్తాన్ అండర్‌వల్డ్ + టెరర్ అటాక్స్ – కథే కిక్ ఇచ్చింది
డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ కథను ప్రెజెంట్ చేసిన తీరు చాలా మందిని ఆకట్టుకుంది. టెరర్ అటాక్స్, పాకిస్తాన్ అండర్‌వల్డ్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ – ఇవన్నీ కలిసిన స్టోరీకి భారీ స్కేల్ వచ్చింది. కొంచెం నెగటివ్ కామెంట్లు ఉన్నా, సినిమాపై వాటి ఎఫెక్ట్ లేకపోవడమే పెద్ద ట్విస్ట్. టాక్ ఒక్కసారిగా పాజిటివ్ వైపు తిరిగిపోయింది.
మూడో రోజుకే 150 కోట్ల క్లబ్? నార్త్‌లో సెన్సేషన్!
ట్రేడ్ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం, నార్త్ బెల్ట్‌లో ధురంధర్ మూడు రోజుల్లోనే 150 కోట్ల గ్రాస్ టచ్ చేసిందట. స్లోగా స్టార్ట్ అయిన సినిమా ఇంత పెద్ద జంప్ కొట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
తెలుగు స్టేట్స్లో అఖండ 2 షాక్… ధురంధర్ లక్!
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన పుష్ మాత్రం పూర్తిగా అనుకోకుండా వచ్చింది. అఖండ 2 పోస్ట్‌పోన్ అయ్యింది, అందుకే బుక్కయిన స్క్రీన్స్ అన్నీ ధురంధర్కి వచ్చాయి. ఆదివారం నాటికి ఆక్యుపెన్సీ పెరిగి, షో కౌంట్ సిటీస్, టౌన్స్‌లో పెరిగిపోయింది.
ముంబైలో మిడ్నైట్ షోస్ – ఇది ఎవరికైనా దక్కే గౌరవం కాదు!
ముంబైలో సినిమా మిడ్నైట్, ఇర్లీ మోర్నింగ్ షోలను రిసీవ్ అవుతోంది. ఈ ట్రీట్మెంట్ ఎవరికి దక్కుతుందంటే — జవాన్, పఠాన్, అనిమల్, గంగుబాయ్, పుష్పా 2 వంటి బ్లాక్‌బస్టర్స్‌కి మాత్రమే. ఇప్పుడు ఈ లిస్ట్‌లో ధురంధర్ కూడా చేరిపోయింది.
3 గంటల సీరియస్ డ్రామా… ఎంటర్టైన్మెంట్ ఫిల్లర్స్ లేకుండా!
సినిమా ఫార్మాట్ అసలు బాక్సాఫీస్‌కు కష్టమే అనిపించింది.
3 గంటలకు పైగా రన్‌టైమ్
ఎంటర్టైన్మెంట్ ఫిల్లర్స్ దాదాపు లేవు
కథలో 80% పాకిస్తాన్‌లోనే జరుగుతుంది
అయినా కూడా ప్రేక్షకులు స్క్రీన్కు కట్టేసి ఉంచడం ఆదిత్య ధర్ స్కిల్ అని ట్రేడ్ అనిస్తోంది. అకషయ్ ఖన్నా, సంజయ్ దత్ల పెర్ఫార్మెన్స్కి భారీ టాక్. రణవీర్ గురించి మాట్లాడేది వీళ్ల తర్వాతే.
ఓవర్సీస్లో కూడా అలజడి – 2 మిలియన్ దాటేసింది!
టికెట్ రేట్లు ఎక్కువగా 15 డాలర్ల లోపే ఉన్నా, ఓవర్సీస్లో సినిమా దూసుకుపోతోంది. మూడో రోజుకే దాదాపు $800K కలెక్ట్ చేసి, మొత్తం కలెక్షన్ 2 మిలియన్ దాటేసింది. ఈ జానర్ సినిమాకు ఇది చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్.
స్లో స్టార్ట్ బిగ్ జంప్ !
కంపిటీషన్ తక్కువగా ఉన్న ఈ పరిస్థితిలో, ధురంధర్ లాంగ్ రన్‌కు సెట్ అయ్యిందనే ఫీలింగ్ ట్రేడ్‌లో ఉంది. మొదట ఎవరూ పట్టించుకోని సినిమా ఇప్పుడు ఎవరి నోళ్లలోనూ ధురంధర్ మాత్రమే!
