ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ తెరకెక్కించిన ‘ముఫాసా:ది లయన్ కింగ్’ మ్యూజికల్ లైవ్ యాక్షన్ చిత్రం గతేడాది విడుదలై పిల్లలతో పాటు పెద్దల్నీ విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అనేక భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి తెలుగులో హీరో మహేశ్‌బాబు.. ముఫాసా పాత్రకు తన వాయిస్ అందించడం మరో స్పెషల్ ఎట్రాక్షన్. 2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’కు ప్రీక్వెల్‌గా వచ్చిన చిత్రమిది. ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం పిల్లలు, పెద్దలు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అఫీషియల్ గా ఈ సంస్ద తన ఓటిటి రిలీజ్ డేట్ ని ప్రకటించింది.
‘ముఫాసా:ది లయన్ కింగ్’ సినిమా ఇప్పుడు ఓటీటీ లో అలరించడానికి సిద్ధమైంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ నెల 18 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ.
సూపర్ హిట్ లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా:ది లయన్ కింగ్’వచ్చింది. ఇందులో ముఫాసా అసలు రాజుగా ఎలా మారాడు? ముఫాసా గత చరిత్ర ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ టాకా అలియాస్ స్కార్ ఎవరు? స్కార్‌కు ఆ పేరు ఎందుకు వచ్చింది? అన్నది ఇందులో చూపించాడు.
ముఫాసా అసలు రాజుగా ఎలా మారాడు? ఆయన గత చరిత్ర ఏంటి? అనే అంశాల్ని చూపించిన విధానం సినీప్రియుల్ని మెప్పించింది. ముఫాసా కథ కూడా కొత్తగా ఏమీ అనిపించదు.
కుటుంబం నుంచి దూరమైన ఓ అనాథ.. ఇంకో కుటుంబానికి దగ్గరవ్వడం.. అక్కడ ఓ సోదరుడు దొరకడం.. ఇద్దరూ కలిసి మెలిసి ఉండటం.. మధ్యలో ప్రేమ కారణంగా ద్వేషం పెరగడం.. సొంత వారిపైనే కత్తులు దుయ్యడం.. చివరకు మళ్లీ ఒక్కటి అవ్వడం వంటి పాయింట్లతో ముందుకు సాగుతుంది.