ఒక వయస్సు వచ్చాక గతంలో చేసిన చూస్తే కాస్తంత ఇబ్బందిగానూ, మరికొన్నిసార్లు గర్వంగానూ అనిపిస్తుంది. ఇప్పుడు నాగార్జున పరిస్దితి అలాగే ఉంది. ఆయన గతంలో లవర్ బోయ్ గా, రొమాంటిక్ గా హీరోగా చేసారు. హీరోయిన్స్ తో హాట్ హాట్ గా స్టెప్ట్స్ వేసారు. అయితే వీటిని తన పిల్లల ముందు చూడాలంటే ఆయనకు ఇబ్బందిగా ఉంది. అదే విషయం స్టేజిపైనే చెప్పారు.

తన కుమారుడు నాగచైతన్య నటించిన ‘తండేల్‌’ విజయం సాధించడంపై నాగార్జున (Nagarjuna) ఆనందం వ్యక్తం చేశారు. ‘తండేల్‌’ సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు.

నాగార్జున ప్రసంగానికి ముందు.. ఆయన సినిమాలకు సంబంధించిన ఏవీ ప్రదర్శించారు. అందులో కొన్ని రొమాంటిక్స్‌ సీన్స్‌ ఉండడంతో.. ‘‘కొడుకు, కోడలి ముందు అలాంటి వీడియోలు చూపించొద్దు’’ అంటూ నాగార్జున నవ్వుతూ అన్నారు.

అయితే ఆ నవ్వు వెనకాల ఆయన పడ్డ ఇబ్బందిని గుర్తించాలని అభిమానులు అంటున్నారు. అలాంటి AV లు ప్రదర్శించేటప్పుడు ఆ ఈవెంట్ కు ఎవరెవరు హాజరువుతారు. అసలు ఏ పంక్షన్ అనేది గుర్తుంచుకోవాలని విమర్శలు చేస్తున్నారు.

, , , , , ,
You may also like
Latest Posts from