నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన ‘తండేల్’ సినిమా ఈ నెల 7న విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే. నాగచైతన్య గతంలో రెండు చిత్రాలు డైరక్ట్ చేసిన చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ముందు నాగచైతన్య ఫ్లాఫ్ ల్లో ఉండటంతో ఓపినింగ్స్ ఎలా వస్తాయి అనేది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

చైతు కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

బుక్ మై షోలో తండేల్ బుకింగ్స్ ఓపెన్ చేసేసారు. ఆల్రెడీ నైజాంలో బుకింగ్స్ ఓపెన్ చేయగా వీటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి ఇప్పుడు వరకు బుక్ మై షోలో 20 వేలకి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.

అలాగే ఈ సినిమా బుక్ మై షోలో లక్ష 50 వేలకి పైగా ఇంట్రెస్ట్స్ తో ట్రెండింగ్ లో కూడా కొనసాగుతుంది. మొత్తానికి అయితే తండేల్ సినిమా మంచి ఓపెనింగ్స్ కి తెచ్చుకుంటోందనే చెప్పాలి.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ… ‘తండేల్’ సూపర్ హిట్ అవుతుందని చెప్పారు. ఇది పక్కా లవ్ స్టోరీ అని తెలిపారు. మత్స్యలేశ్యం అనే ఊరుని బేస్ చేసుకుని కథను తయారు చేసినట్టు చెప్పారు.

అక్కడి వారు చేపల వేట కోసం గుజరాత్ పోర్ట్ కి వెళతారని… వారి ప్రధాన నాయకుడిని తండేల్ అంటారని తెలిపారు. తండేల్ అనేది గుజరాతీ పదమని చెప్పారు. కథా రచయిత కార్తీక్ ది మత్స్యలేశ్యం పక్క ఊరని తెలిపారు. అక్కడ జరిగిన ఘటనల ఆధారంగా కథను తయారు చేశారని చెప్పారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

, , , ,
You may also like
Latest Posts from