ఇప్పుడు రష్మిక నిజమైన ప్యాన్ ఇండియా స్టార్ అయ్యంది. నార్త్ లో పుష్ప 2 (Pushpa 2: The Rule), చావా (Chhaava), అనిమల్ (Animal) సినిమాలు దుమ్ము దులిపాయి. ఈ సినిమాల విజ‌యాల త‌ర్వాత ఆమెకు పాన్ ఇండియా క్రేజ్ పెరిగింది. అందుకే ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగింది. చేతిలో వరస ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఇంత బిజీలో ఉన్న ఆమే కావాలని, అవసరం అయితే తమ కాల్షీట్స్ ఎడ్జెస్ట్ చేసుకుంటామంటున్నారు హీరోలు. అలా నాని కూడా ఇప్పుడు ఆమెనే తన సినిమా కోసం అడుగుతున్నట్లు తెలుస్తోంది.ఆమె తన సినిమాలో ఉంటే తన ప్యాన్ ఇండియా ప్రాజెక్టు మార్కెట్ క్రియేట్ అవుతుందని నమ్ముతోంది టీమ్.

నాని (Nani) ప్ర‌ధాన పాత్ర‌లో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ది ప్యార‌డైజ్ . సినిమా ప్రారంభం అవ్వకముందే ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎవరినేది ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు.

ఇప్పటికే శ్ర‌ద్ధా క‌పూర్ (Shraddha Kapoor), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) పేర్లు గట్టిగా వినిపించినప్పటికీ, ఎవ‌రికీ ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ లేదు. అయితే ఇప్పుడు రష్మిక కోసం ట్రై చేస్తున్నట్లు సమచారం.

ఇప్పటికే కుబేర (Kubera) సినిమాల‌తో ప్యాక్ అయిన ఆమె, మరో తెలుగు ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నదే ప్ర‌శ్న. నాని వ్యక్తిగతంగా రష్మికను కన్‌విన్స్ చేయడానికి ముందుకొచ్చాడట. నిర్మాతలుకూడా ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డేట్స్ ఎడ్జెస్ట్ చేసి రష్మిక డేట్స్ ఇవ్వగలదా అనేదే పెద్ద ప్రశ్న

, , , , ,
You may also like
Latest Posts from