నటుడుగానే కాదు నిర్మాతగానూ నాని దూసుకుపోతున్నారు. చిరంజీవితోనే ఏకంగా సినిమా పెట్టిన నాని ఇప్పుడు ఓ చిన్న సినిమా పూర్తి చేసి రిలీజ్ కు పెట్టారు. తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి వచ్చిన ఏ సినిమా ఆడియన్స్‌ని నిరుత్సాహపరచలేదు. ప్రస్తుతం తన బ్యానర్‌లో చిన్న సినిమాల్ని (Small budget movies) మంచి ప్లానింగ్‌తో తీస్తున్నాడు.
ఇప్పటికే ఈ కోర్టు చిత్రం ఓటీటీ బిజినెస్ క్లోజ్ (Ott business) అయింది. దాదాపు రూ.9 కోట్లకు నెట్‌ఫిక్స్ సంస్థ ఈ సినిమాని కొనుగోలు చేసిందని తెలిసింది.
సినిమాకు ప్రియదర్శి రెమ్యునరేషన్ రూ.2 కోట్లు. మిగిలిన రెమ్యునరేషన్స్, మేకింగ్ కోసం రూ.4 కోట్లు కలిపితే . రూ.6 కోట్లలో సినిమా పూర్తైందని సమాచారం. దాంతో రిలీజ్ కు ముందే రూ.3 కోట్లు ప్రాఫిట్. ఇది ఓటీటీ లెక్క మాత్రమే.. ఇంకా శాటిలైట్ బిజినెస్ క్లోజ్ కాలేదు. ఇక థియేటర్ నుంచి వచ్చిందంతా బోనస్ చెప్తున్నారు.
‘‘అందమైన ప్రేమకథ.. బలమైన డ్రామా.. గొప్ప సందేశం.. అన్నీ ఉన్న చిత్రం ‘కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడీ’. దీని విషయంలో నేను అందరికీ ఓ మాట ఇస్తున్నా. సినిమా పూర్తయ్యే సరికి థియేటర్లలో ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా లేచి నిలబడి చప్పట్లు కొడతారని నమ్ముతున్నా’’ అన్నారు హీరో నాని.
ఆయన సమర్పణలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీశ్ తెరకెక్కించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. శివాజి, సాయికుమార్, హర్ష వర్ధన్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది