సినిమా వార్తలు

రాజమౌళి షాక్! ‘బాహుబలి 3’పై క్లారిటీ

‘బాహుబలి: ది ఎపిక్’ విడుదలకు ముందే అభిమానుల ఉత్సాహం పీక్స్‌లో ఉంది. అదే సమయంలో “బాహుబలి 3” అనౌన్స్‌మెంట్ వస్తుందేమో అన్న అంచనాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే — “బాహుబలి: ది బిగినింగ్”, “బాహుబలి: ది కన్‌క్లూజన్” సినిమాలు మాత్రమే కాదు, భారతీయ సినీ చరిత్రనే మార్చేశాయి. తెలుగు సినిమాను గ్లోబల్ స్టేజ్‌కి తీసుకెళ్లి, ప్రభాస్‌కి పాన్‌–ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చాయి.

ఇప్పుడీ రెండు సినిమాలను కలిపి, కొత్త అన్‌సీన్ ఫుటేజ్‌తో “బాహుబలి: ది ఎపిక్” పేరుతో రీ–రిలీజ్ చేస్తున్నారు. దాంతో అభిమానులలో హైప్ మరింత పెరిగింది. “సినిమా ఎండ్‌లో రాజమౌళి బాహుబలి 3ని అనౌన్స్ చేస్తారట!” అనే టాక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

కానీ ఇప్పుడు రాజమౌళి స్వయంగా ఆ రూమర్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టేశారు.

“ప్రస్తుతం బాహుబలి 3పై ఎలాంటి ప్రణాళికలు లేవు,” అని స్పష్టం చేశారు. అయితే అభిమానుల కోసం ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ మాత్రం ఇచ్చారు “బాహుబలి: ది ఎటర్నల్ వార్” అనే యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ప్రస్తుతం డెవలప్‌మెంట్‌లో ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ట్రైలర్ “బాహుబలి: ది ఎపిక్”తో పాటు థియేటర్లలో చూపించబోతున్నారని వెల్లడించారు.

రాజమౌళి మాట్లాడుతూ.. బాహుబలి 3 అని ఎప్పట్నుంచో ఉంది కానీ అది రెగ్యులర్ సినిమాలాగా రాదు. అది బాహుబలి 3 కాదు. బాహుబలి ఎటర్నల్ వార్ అని ప్లాన్ చేశాను. బాహుబలి ఎపిక్ సినిమా చివర్లో ఆ టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నాను. బాహుబలి ఎటర్నల్ వార్ బాహుబలి సినిమాకు కంటిన్యుటీనే ఉంటుంది. అయితే అది యానిమేషన్ సినిమా, 3D యానిమేషన్ సినిమా. ఇషాన్ శుక్ల అనే 3D యానిమేషన్ డైరెక్టర్ దీనికోసం వర్క్ చేస్తున్నాడు. అతను కూడా కథకు కొన్ని సజెషన్స్ ఇచ్చాడు.

ఆల్రెడీ రెండున్నరేళ్లుగా ఆ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. 120 కోట్ల బడ్జెట్ తో బాహుబలి ఎటర్నల్ వార్ యానిమేషన్ సినిమా తెరకెక్కుతుంది. అందులో ట్విస్టులు ఉంటాయి, కథ బాగుంది, అన్ని బాహుబలి క్యారెక్టర్స్ ఉంటాయి. బాహుబలి వరల్డ్ ఇక్కడితో ఆగదు. మున్ముందు ఏదో ఒకరకంగా వస్తూనే ఉంటుంది అని తెలిపారు.

మొత్తానికి — ‘బాహుబలి 3’ కాకపోయినా, ‘బాహుబలి’ యూనివర్స్ మాత్రం కొనసాగుతోంది!

Similar Posts