ఫేక్ డెత్ రూమర్ల బారిన ఈ మధ్యన సెలబ్రెటీలు తెగ పడుతున్నారు. తాజాగా మరొక సినీ సెలబ్రెటీ ఈ ఫేక్ డెత్ న్యూస్ బారిన పడింది. ఆమె మరెవరో కాదు ఇటీవల వరుణ్ తేజ్ మట్కాలో ఓ కీలక పాత్ర పోషించిన నోరా ఫతేహి.
స్పెషల్ సాంగ్స్ తో మెప్పిస్తోన్న ఈ హాట్ బ్యూటి మృతి చెందిందంటూ ఓ ఇన్ స్టా గ్రామ్ పేజీ షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో హీరోయిన్ నోరా పతేహి బంగి జంప్ చేయడానికి పైనుంచి దూకిందని, అయితే రోప్ తెగిపోవడంతో ఆమె లోయలోకి పడిపోయి ప్రాణాలు కోల్పోయిందని నకిలీ ఫోటోలు జత చేసి షేర్ చేశారు.
దీంతో ఒక్కసారిగా నోరా అభిమానులు, బంధువులు టెన్షన్ పడ్డారు. నిజంగానే ఆమె చనిపోయిందా అని గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
అయితే మీడియా వర్గాలకు అందుతున్న సమాచారం ప్రకారం నోరా పతేహీ క్షేమంగానే ఉన్నట్లు ఈ వైరల్ అవుతోన్న వీడియో కల్పితమని క్లారిటీ వచ్చింది.
బంగీ జంప్ చేస్తూ మృతి చెందిన మహిళ,నోరా ఫతేహి కాదని తేలింది. దాంతో నోరా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో చూసిన అభిమానులు మాత్రం ఫేక్ వీడియో షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పేజీపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకి ట్యాగ్ చేస్తున్నారు.
నోరా సినిమాల విషయానికొస్తే.. టెంపర్, బాహుబలి ది బిగినింగ్, కిక్ 2, షేర్, లోఫర్, ఊపిరి తదితర ల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇక ఇటీవల వరుణ్ తేజ్ మట్కా మూవీలో కీలక పాత్రలో నటించింది.