జూనియర్ ఎన్టీఆర్ దాదాపు పది ఏళ్లుగా ఓ ఫెయిల్యూర్ లేకుండా దూసుకుపోతూ వస్తున్నారు. కానీ ఆ విజయ శ్రేణి ‘వార్ 2’తో ముగిసింది. ఆ సినిమా వెనుక ఉన్న కీలక వ్యక్తుల్లో ఒకరు నిర్మాత నాగ వంశీ. తెలుగు రాష్ట్రాల్లో ‘వార్ 2’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుగోలు చేసిన ఆయనకు ఈ ప్రాజెక్ట్ భారీ నష్టాలు తెచ్చింది.

తాజాగా తన కొత్త సినిమా ‘మాస్ జాతర’ ప్రమోషన్‌లో పాల్గొన్న నాగ వంశీ, ఈ విషయంపై ఓపెన్‌గా మాట్లాడారు.

“‘దేవర’ రైట్స్‌తో మంచి లాభాలు వచ్చాయి. అదే ఉత్సాహంతో ‘వార్ 2’ కూడా తీసుకున్నాం. కానీ ఈసారి బాగా దెబ్బతిన్నాం. నేను, ఎన్టీఆర్ ఇద్దరం కూడా యశ్‌రాజ్ ఫిల్మ్స్‌, ఆదిత్య చోప్రా మీద బ్లైండ్‌గా నమ్మకం పెట్టుకున్నాం. వాళ్ల బ్రాండ్ నేమ్ చూసి వెళ్లాం… కానీ అది తలకిందులైపోయింది” అని నాగ వంశీ తెలిపారు.

అలాగే ఆయన చెప్పిన మరో ఆసక్తికర విషయం—

“నేను ఈ సినిమాకి నిర్మాత కాదు. కేవలం డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాను. అయినా కూడా ఈ సినిమా ఫెయిల్ కావడంతో సోషియల్ మీడియాలో నన్నే ట్రోల్ చేస్తున్నారు! తప్పులు ఎవరికైనా జరుగుతాయి, కానీ ఈ ఫలితంలో నా మేకింగ్ ఇన్‌వాల్వ్‌మెంట్ లేదు” అని క్లారిటీ ఇచ్చారు.

“నాగ వంశీ – ఎన్టీఆర్ బ్లైండ్ ట్రస్ట్ ఫెయిల్ అయిందా? యశ్‌రాజ్ బ్రాండ్‌పై నమ్మకం మోసం చేసిందా?” అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది!

, , , , ,
You may also like
Latest Posts from