ఓజీ రిలీజ్ అయి నాలుగో రోజుకి కూడా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తోంది. దసరా హాలిడే సీజన్‌లో మరింత కలెక్షన్స్ రావాలనే ఉద్దేశంతో, మేకర్స్ ఓ కొత్త ప్లాన్ వేశారు. థియేటర్లలో తొలుత ఎడిట్ చేసిన నేహా శెట్టి స్పెషల్ సాంగ్‌ని రేపటినుంచే మళ్లీ యాడ్ చేస్తున్నారని సమాచారం.

బ్యాంకాక్‌లో కోట్ల రూపాయల ఖర్చుతో షూట్ చేసిన ఈ పెప్ సాంగ్‌ను రిలీజ్ టైమ్‌లో కట్ చేశారు. ఫ్లో డిస్టర్బ్ అవుతుందని కారణం చెప్పారు. కానీ ఫ్యాన్స్ నుంచి వస్తున్న డిమాండ్, దసరా హాలిడే అడ్వాంటేజ్ దృష్ట్యా… ఇప్పుడు ఆ పాటని సెకండ్ హాఫ్ లో పెట్టబోతున్నారు.

ఇదే సమయంలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… ఇలాంటి అనుభవమే ఇటీవల నిధి అగర్వాల్‌కి కూడా వచ్చింది. మిరాయ్ సినిమా కోసం షూట్ చేసిన ఆమె సాంగ్ కూడా ఎడిట్ టేబుల్‌కే పరిమితమైపోయింది. రీసెంట్‌గా యాడ్ చేసినా… నిధికి పెద్దగా క్రెడిట్ రాలేదు.

అంటే నిధి, నేహా ఇద్దరూ ఒకే పరిస్థితిలో పడిపోయారు. హై బడ్జెట్‌తో చేసిన స్పెషల్ సాంగ్స్ చివరికి స్క్రీన్ మీద కనిపించకపోవడం వాళ్ల కెరీర్‌కి పెద్ద లోటే. ఇప్పుడు ఓజీలో నేహా సాంగ్ మళ్లీ యాడ్ అవ్వడం ఆమెకు రీ-ఎంట్రీగా పని చేస్తుందేమో చూడాలి.

నేహా శెట్టి పాటతో ఓజీ రీపీట్ ఆడియెన్స్‌ని దసరా హాలిడేలో మళ్లీ థియేటర్లకు రప్పించగలదా?

, , , , ,
You may also like
Latest Posts from