
పవన్ కళ్యాణ్ OG కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రీమియర్స్ బాక్సాఫీస్ దగ్గరే చూపించింది. టికెట్ రేట్లు భారీగా ఉన్నా, థియేటర్ల దగ్గర అభిమానుల తాకిడి మామూలుగా లేదు.
తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలతోనే డబుల్ డిజిట్ గ్రాస్ వసూలు చేసేసింది. కర్ణాటక, తమిళనాడు, మిగతా ఉత్తర భారత రాష్ట్రాలన్నింటిలోనూ షోలు సాలిడ్ నంబర్స్ సాధించాయి.
మొత్తంగా ఆల్ ఇండియా ప్రీమియర్స్ కలెక్షన్స్ 25 కోట్లకు పైగా దాటేశాయి. ఇది అద్భుతమైన రికార్డ్ – ఇప్పటివరకు ఏ సినిమా ప్రీమియర్స్‌తో కూడా 20 కోట్లను తాకలేదు! OG దాన్ని దాటి కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.
రివ్యూల విషయానికొస్తే – క్రిటిక్స్ డీసెంట్ టు గుడ్ రేంజ్ లో రేటింగ్స్ ఇస్తే, ఫ్యాన్స్ మాత్రం ‘పవర్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్’ అని పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నారు. న్యూట్రల్ ఆడియన్స్ కూడా ‘ఓకే/డీసెంట్ వాచ్’ అని భావిస్తున్నారు.
