పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ (They Call Him OG)’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూపించినా, పబ్లిక్ కి ఆలస్యంగా వదిలారు. ఫ్యాన్స్ గంటల తరబడి ఎదురు చూసిన ఈ ట్రైలర్ మాత్రం వదిలిన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అంచనాలు మించి హైప్ పెంచేసింది.

ట్రైలర్ చూస్తే… పవన్ కళ్యాణ్ 1980’s ముంబై మాఫియా లుక్ లో వింటేజ్ రాంపేజ్ స్వాగ్ తో కనిపించాడు. తన ఫ్యామిలీ కోసం ముంబైని వదిలేసిన గ్యాంగ్ స్టర్, తిరిగి అడుగుపెట్టి శత్రువులను ఎలా చిత్తు చేశాడన్నదే స్టోరీ లైన్ గా చూపించారు. ఇమ్రాన్ హష్మీ విలనిజం, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ ప్రెజెన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి.

తమన్ ఇచ్చిన బీజీఎమ్ ఒక రేంజ్ లో రచ్చ లేపుతూ , ప్రతి షాట్ టెక్నికల్‌గా రిచ్ గా కనిపిస్తోంది. పవన్ డైలాగ్స్ తక్కువైనా, ఎలివేషన్స్ మాత్రం థియేటర్స్ లో కుర్రకారిని ఫుల్ గా ఫైరప్ చేసేలా ఉన్నాయి.

ఓవరాల్ గా చూస్తే, ‘ఓజీ’ ట్రైలర్ రీసెంట్ టైంలో బెస్ట్ కట్స్ లో ఒకటి అనిపించేలా డిజైన్ అయ్యింది. స్టోరీ పాయింట్ సింపుల్ గానే ఉన్నా, పవన్ కళ్యాణ్ వింటేజ్ మాస్ అవతారం కోసం తీసిన ఈ సినిమా, థియేటర్స్ లో రికార్డుల జాతర ఖాయం అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

, , , , , ,
You may also like
Latest Posts from