
కన్నడలో భారీ అంచనాలు నెలకొల్పిన ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) రిలీజ్‌పై తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద చర్చే నడుస్తోంది. టికెట్ ధరల పెంపు ఇవ్వకూడదని కొంతమంది అభ్యంతరం చెప్పగా… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం “సినిమా మనసులను కలపాలి కానీ విభజించకూడదు” అంటూ స్పష్టమైన సందేశం ఇచ్చారు.
సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్, సీనియర్ అధికారులతో పరిస్థితిని సమీక్షించిన పవన్, జాతీయ ఐక్యత దృష్ట్యా పెద్ద మనసు చూపాలని అధికారులకు సూచించారు. ఫలితంగా హొంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న, రిషబ్ శెట్టి హీరో-డైరెక్టర్‌గా వస్తున్న ‘కాంతార 1 కు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపు ఆమోదం లభించింది.
“డాక్టర్ రాజ్‌కుమార్ కాలం నుంచి ఇప్పటి వరకు కన్నడ నటులు తెలుగు ప్రేక్షకుల నుంచి అపారమైన ఆదరణ పొందారు. ఇరు పరిశ్రమల ఫిల్మ్‌చాంబర్స్ కలిసి సమస్యలను చర్చించి పరిష్కరించుకోవాలి. కర్ణాటకలో సమస్యలు ఉన్నప్పటికీ మనం అడ్డంకులు సృష్టించకూడదు” అని పవన్ అధికారులకు సూచించినట్టు సమాచారం.
ఈ నిర్ణయంతో ‘కాంతార: చాప్టర్ 1’ టికెట్ హైక్‌కు గ్రీన్ సిగ్నల్ దొరకగా, సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి!
