
పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ (OG)కి కర్ణాటకలో గట్టి ఇబ్బందులు మొదలయ్యాయి. సినిమా పోస్టర్లు, బ్యానర్లు అక్కడ నుంచి తొలగిస్తున్నారని సినీ వర్గాలు పవన్ దృష్టికి తీసుకెళ్లాయి. ఈ పరిణామాలపై పవన్ స్వయంగా స్పందించారు.
‘‘కర్ణాటకలో ఇలాంటి చర్యలు మంచివి కావు. మనం కన్నడ సినిమాలను ఎప్పుడూ సోదరభావంతో స్వాగతించాం. డా. రాజ్కుమార్ నుంచి రిషబ్ శెట్టి వరకూ అందరినీ తెలుగు ప్రేక్షకులు గౌరవించారు. మన సినిమాలకు వ్యాపారపరంగా ఆటంకాలు పెట్టకూడదు. రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ చర్చించుకోవాలి. ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తా’’ అని పవన్ స్పష్టం చేశారు.
తెలుగు సినీ వర్గాల ఆవేదన
తెలుగు సినిమాలను కర్ణాటకలో రిలీజ్ చేయడంలో పలు అవరోధాలు ఎదురవుతున్నాయని నిర్మాతలు వాపోతున్నారు. టికెట్ ధరల విషయంలో అక్కడి ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడం, ‘ఆర్ఆర్ఆర్’, ‘గేమ్ ఛేంజర్’, ‘హరిహర వీరమల్లు’, ఇప్పుడు ‘ఓజీ’ వరకూ ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. అక్కడ తెలుగు సినిమాకు టికెట్ ధరల విషయంలో కోర్టుకు కూడా వెళ్లారని తెలిపారు. పరిస్థితి అంత దారుణంగా మారడంతో కొంతమంది నిర్మాతలు హైకోర్టుకే వెళ్లాల్సి వచ్చిందని సమాచారం.
అదే సమయంలో… ‘కాంతార చాప్టర్ 1’కు గ్రీన్ సిగ్నల్!
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1)కి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచేందుకు ఓకే చెప్పింది. తెలుగు సినిమాను కర్ణాటకలో విడుదల చేసే క్రమంలో పలు ఆటంకాలు ఎదురవుతున్నాయని, మన చిత్రాలకు టికెట్ ధరల పెంపు విషయంలో అక్కడి ప్రభుత్వం సానుకూలంగా ఉండటం లేదని పేర్కొన్నాయి.
