స్టార్ హీరోల సినిమాలకి అభిమానులు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరని గతంలో ఎన్నో సార్లు చూశాం. అలాగే పవన్ కళ్యాణ్‌ సినిమాల విషయంలో ఆ క్రేజ్‌కి కొలమానం ఉండదు. ‘ఓజీ’ రిలీజ్ దగ్గరపడుతున్నకొద్దీ ఆ క్రేజ్ ఇంకో లెవెల్‌కి వెళ్లిపోయింది. పవర్ స్టార్ కు ఎంతటి వీరాభిమానులు ఉన్నారో మళ్లీ నిరూపితమైంది.

ఇప్పటికే ఓవర్సీస్‌లో పవన్ సినిమా టికెట్ రికార్డ్ ధరకు అమ్ముడైన సంగతి తెలిసిందే. ఆ మొత్తాన్ని సదరు అభిమాని నేరుగా జనసేన పార్టీ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వంతు వచ్చింది.

తాజాగా చిత్తూరు జిల్లా రాఘవ్ థియేటర్‌లో ఒక పవన్ అభిమాని శ్రీరామ్ “ఓజీ” టికెట్‌ను లక్ష రూపాయలకు కొనుగోలు చేశాడు. అంతే కాకుండా లక్ష రూపాయల చెక్కును జనసేన పార్టీకి అందజేసి, ఆ డబ్బు గ్రామాభివృద్ధికి వెచ్చించాలని సూచించడం మరింత హైలైట్ అయ్యింది.

ఇలాంటి సంఘటనలు పవన్ కళ్యాణ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్‌ ఎంత బలంగా ఉందో చూపిస్తున్నాయి. హీరోపైన ఉన్న ప్యాషన్, ఆయన రాజకీయ, సినీ ఇమేజ్‌కి కలిసొచ్చేలా ప్రతి అడుగులోనూ ఫ్యాన్స్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌లో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా, తమన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 27న “ఓజీ” గ్రాండ్‌గా విడుదల కానుండగా, బుకింగ్స్ ఓపెన్ అవగానే పలు థియేటర్లలో ఇలాంటి స్పెషల్ రికార్డులు సృష్టించే అవకాశముందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

పవన్ సినిమా కోసం టికెట్‌కి లక్ష పెట్టిన అభిమాని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిలీజ్ వరకు ఇంకెన్ని అద్భుతాలు “ఓజీ” క్రేజ్ చూపిస్తుందో చూడాలి!

డైరెక్టర్ సుజీత్(Sujeeth) దర్శకత్వం వహించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా.. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా మంచి హైప్ ను క్రియేట్ చేసింది. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు సెప్టెంబర్ 25 న రిలీజ్ కానుంది.

, , , , ,
You may also like
Latest Posts from