పవన్ అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రేమికులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడికల్ డ్రామా “హరి హర వీర మల్లు”. ఈ చిత్రం మే 9, 2025న థియేట్రికల్ రిలీజ్ డేట్ ఇప్పటికే ఎనౌన్స్ చేసారు. అయితే ఈ డేట్ మళ్లీ మారుస్తారా అనే సందేహం చాలా మందికి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి. అయితే మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ట్రాక్‌లోనే ఉంది.

ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది, ఒకటి లేదా రెండు రోజుల పని మాత్రమే మిగిలి ఉంది. రీసెంట్ గా మరో ప్రధాన నటి నిధి అగర్వాల్ తన పెండింగ్ పార్ట్ లను పూర్తి చేసింది. దీంతో ఇకపై వాయిదాలు ఉండవని టీమ్ నమ్మకంగా ఉంది.

ఉగాది రోజు రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా మే 9 రిలీజ్ అని తెలిపారు. పోస్టర్ లో యుద్ధ వీరుడు లాంటి రూపంతో ముఖంపై చిరునవ్వుతో అందంగా కనిపించరు పవన్ కళ్యాణ్. “ధర్మం కోసం యుద్ధం” అంటూ ట్యాగ్ లైన్ రాస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ చిత్రం రెండు పార్టులు గా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ ని ‘హరి హర వీరమల్లు పార్ట్‌1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్ నటిస్తుండగా , విక్రమ్ జీత్, జిష్ణుసేన్ గుప్తా, నోరాహి ఫతేహి, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

, , ,
You may also like
Latest Posts from