పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ‘హరిహర వీరమల్లు’, ‘ఓజి’ చిత్రాలను ఆయన ముందుగా పూర్తి చేస్తాడని చెప్తున్నారు. ఇక ఈ సినిమాల తర్వాత ఆయన దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను ప్రారంభించబోతున్నారు.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదట్నుంచి సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్-హరీష్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాపై తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా కోసం పవన్‌కు మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా రూ.170 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, టాలీవుడ్ సినీ చరిత్రలో ఇంతటి భారీ రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా పవన్ నిలుస్తాడు.

,
You may also like
Latest Posts from