ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘సితారే జమీన్‌ పర్‌’ (Sitaare Zameen Par) ఇప్పుడు యూట్యూబ్ లో రిలీజ్ అయింది. రెగ్యులర్ గా జరుగే ఓటిటీ విడుదలను పక్కన పెట్టి, ఈ సినిమాను ₹100 రెంటల్ బేసిస్ మీద యూట్యూబ్ లో రిలీజ్ చేయడం ఓ గొప్ప ప్రయోగంగా చెప్పొచ్చు.

ఈ సినిమా హక్కుల కోసం పెద్ద మొత్తంలో (దాదాపు 120 కోట్లు) డీల్స్ వచ్చినా, వాటిని తిరస్కరించినట్టు ఆమీర్ ఖాన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. డైరెక్టర్ ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో, జెనీలియా డిసౌజా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

యూట్యూబ్ లో సినిమాను ఎలా చూడాలి?
₹100 చెల్లించి రెంట్‌ చేయాలి.

మీకు ఇష్టమైన పేమెంట్ మోడ్‌తో లేదా కొత్తదాన్ని యాడ్ చేసి చెల్లించొచ్చు.

ఒకసారి పేమెంట్ పూర్తయ్యాక, మీకు కన్‌ఫర్మేషన్ వస్తుంది.

చెల్లింపు చేసిన 30 రోజుల లోగా ఎప్పుడైనా సినిమా చూడొచ్చు.

ఒకసారి సినిమా చూడటం ప్రారంభించిన తర్వాత 48 గంటల్లో ఎన్ని సార్లైనా చూడొచ్చు.

సినిమా యూట్యూబ్ లో youtube.com/purchases అనే సెక్షన్‌లో లభ్యం.

హిందీతోపాటు పలు భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుందని తెలిపిన ఆమిర్‌.. సబ్‌టైటిల్స్‌ కూడా ఉంటాయని చెప్పారు. యూట్యూబ్‌లో విడుదల చేయడం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘అత్యధిక డివైజ్‌లలో యూట్యూబ్‌ ఉంటుంది. దాని ద్వారా ఈ సినిమా ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశముంది. ప్రేక్షకుడికి సినిమాను అందుబాటులో ధరలో చూపించాలనేది నా డ్రీమ్‌’’ అని పేర్కొన్నారు.

ఈ నిర్ణయం ద్వారా ఆమీర్ ఖాన్ డిజిటల్ మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌కి నాంది పలికేలా ఉన్నారు. ‘సితారే జమీన్‌ పర్‌’ (Sitaare Zameen Par) ఇప్పుడు మీ స్క్రీన్‌కి ఎంతో దగ్గరలో ఉంది — చూసేయండి!

, , ,
You may also like
Latest Posts from