టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రికార్డు స్థాయిలో 50 సినిమాలు పూర్తి చేసిన ఈ బ్యానర్, ఇటీవల వరుస ఫ్లాప్స్‌తో నష్టాల్లోకి వెళ్లింది. అయితే ‘మిరాయ్’ బ్లాక్‌బస్టర్ విజయంతో నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశారు.

ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న సినిమాల జాబితా చూసి ఇండస్ట్రీ షాక్ అవుతోంది! ప్రస్తుతానికి ప్రభాస్‌తో ‘రాజా సాబ్’, సిద్ధు జోన్నలగడ్డతో ‘తెలుసు కదా’ రిలీజ్‌కి సిద్ధమవుతుండగా — వచ్చే రెండు సంవత్సరాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 13 భారీ ప్రాజెక్టులు లైన్‌లో పెట్టిందట!

ఇవే ఆ హాట్ లిస్ట్

తెలుసు కదా
ది రాజా సాబ్
గూడచారి 2
మౌగ్లీ
మిరాయ్ 2
జాంబీ రెడ్డి 2
ధ్రువ సర్జా సినిమా
రనమండల
పినాక
మా కాళీ
గరివిడి లక్ష్మి
జాత్ 2
పవన్ కళ్యాణ్‌తో మాస్ ప్రాజెక్ట్

టాలీవుడ్‌లో హ్యాట్రిక్ హిట్స్ కోసం రెడీ అవుతున్న ఈ బ్యానర్, కొత్త దర్శకులు – స్టార్ హీరోల కాంబినేషన్లపై భారీ చర్చలు జరుపుతోందట. ఇండస్ట్రీ టాక్ ఏంటంటే… “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మళ్లీ గేమ్ చెంజర్ అవుతుంది!”

ఏ సినిమా ఫస్ట్‌గా సెట్స్‌పైకి వెళ్తుంది? పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? — అన్నది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

, , , , ,
You may also like
Latest Posts from