
ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తున్న సినిమా ‘ది రాజాసాబ్’! . ఒక్కో అప్‌డేట్ కోసం ఓ లెవెల్‌లో వెయిట్ చేసిన అభిమానులకు మేకర్స్ సూపర్ గిఫ్ట్ ఇచ్చేశారు. టీజర్‌కి పడ్డ రెస్పాన్స్ వల్ల ఎక్సైట్మెంట్ రెట్టింపు అయ్యింది. ఇప్పుడు దానికి ఎండ్ కార్డ్ వేసినట్టే… మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ బయటకి వచ్చింది!
‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ – గూస్‌బంప్స్ గ్యారంటీ!
తాజాగా రిలీజ్ అయిన 3 నిమిషాల 34 సెకన్ల ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఫుల్‌గా తాకింది. హారర్ సీన్స్, మొసళ్లతో ఫైట్ — స్క్రీన్‌పై రెబల్ స్టార్ రోరింగ్ చూసి థియేటర్లు షేక్ అయ్యే లెవెల్‌లో ఉంది.
“ఏందిరా మీ బాధ.. పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా?” అనే ప్రభాస్ డైలాగ్ ఒక్కటే ట్రైలర్ హైలైట్‌గా మారింది.
విలన్‌గా సంజయ్ దత్ లుక్ మరింత అగ్రెసివ్‌గా ఉండటంతో, హీరో–విలన్ క్లాష్ బ్లాక్‌బస్టర్ హంగామా క్రియేట్ చేయబోతోందని ట్రైలర్‌లోనే క్లియర్ అయ్యింది.
ఈ హారర్–రోమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్‌గా ఆకట్టుకోబోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
