సినిమా వార్తలుసోషల్ మీడియా

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ పై – మారుతి ఎమోషనల్ పోస్ట్ వైరల్!

దీర్ఘకాలంగా షూటింగ్‌లో ఉన్న ప్రభాస్‌ యొక్క భారీ సినిమా ‘ది రాజా సాబ్’ ఎట్టకేలకు పూర్తయింది! ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు మారుతి సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.

మారుతి ట్వీట్ చేస్తూ ఇలా రాశాడు –

“23 ఏళ్ల క్రితం ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది… ఈ రోజు, అదే తేదీన ఆయన ‘ది రాజా సాబ్’ షూట్ పూర్తి చేశారు. ప్రభాస్ విజయయాత్రలో భాగం కావడం మా అదృష్టం. ఈ సినిమా ఆయన కెరీర్‌లో కొత్త ఎనర్జీ తెస్తుంది. అభిమానుల ప్రేమ, ఆత్రుత మాకు తెలుసు — అందుకే అందించేది బెస్ట్ మాత్రమే. రాబోయే రోజులు రెబెల్ గాడ్ భక్తుల పండుగగా మారబోతున్నాయి.”

3 సంవత్సరాలుగా షూటింగ్‌లో ఉన్న ఈ హారర్-కామెడీ ప్రాజెక్ట్ చివరకు ర్యాప్ అయింది. ప్రభాస్ సరసన మాలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అదనంగా సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

మరో ప్రక్క ‘ది రాజాసాబ్’ సంక్రాంతికే థియేటర్లలోకి రానుందని నిర్మాత ఎస్‌కెఎన్ క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ పూర్తి కాలేదని, రీషూట్లు జరుగుతున్నాయన్న రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ “పండగకు వస్తున్నాం… పండగ చేసుకుంటున్నాం” అంటూ ఎస్‌కెఎన్ చేసిన ట్వీట్‌తో రిలీజ్ డేట్ జనవరి 9 ఫిక్స్ అయినట్టైంది.

ఈ భారీ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ నడుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండటం మరో ప్రత్యేక ఆకర్షణ.

Similar Posts