తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది ప్రీతి జింటా. తెలుగులో వెంకటేశ్ సరసన ప్రేమంటే ఇదేరా సినిమా, మహేష్ బాబు జోడిగా యువరాజు చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది.

అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ప్రీతి జింటా ఒకరు. కొన్నాళ్లుగా సినీ ప్రపంచానికి దూరంగా ఉన్న ప్రీతి జింటా ఇప్పుడు కోట్లు సంపాదిస్తుంది. భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లోనూ కోట్ల సంపద కలిగి ఉంది. కొన్నాళ్లుగా సినిమాల్లో యాక్టివ్ గా లేకపోయిన నిత్యం ఏదోక విషయంతో వార్తలలో నిలుస్తుంది.

తాజాగా ఈ బాలీవుడ్ నటి కాంగ్రెస్‌ (Congress) పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నటి ప్రీతి జింటా తన సామాజిక మాధ్యమ ఖాతాలను భాజపాకు అప్పగించినందుకు న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఆమె తీసుకున్న రూ.18 కోట్ల రుణం మాఫీ అయ్యిందని ఆరోపిస్తూ కేరళ కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.

గత వారం ఆ బ్యాంకును మూసేయడంతో డిపాజిటర్లు రోడ్డున పడ్డారని ఆరోపించింది. ఈ పోస్ట్‌పై ప్రీతి జింటా స్పందిస్తూ.. తాను సామాజిక మాధ్యమ ఖాతాలను సొంతంగానే నిర్వహించుకుంటానని, ఎవరికీ ఇవ్వలేదని, ఇలా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. 10 ఏళ్ల కిందటే బ్యాంకు నుంచి తాను రుణం తీసుకొని తీర్చేశానని స్పష్టంచేశారు.

ఈ హీరోయిన్ 2016లో జీన్ గూడెనఫ్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరు ఐదేళ్లు ప్రేమలో ఉన్నారు. సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చింది

You may also like
Latest Posts from