ఇప్పుడు ఎక్కడ చూసినా మహేశ్‌బాబు(Mahesh Babu) – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే SSMB29 ప్రాజెక్ట్ కు సంభందించిన కబుర్లే . ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే ఆమె అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఈ నేపధ్యంలో ఆమె రెమ్యునరేషన్ విషయమై నెట్టింట పెద్ద చర్చ మొదలైంది.
ఈ చిత్రం కోసం ప్రియాంక చోప్రా ఇప్పటికే లుక్ టెస్ట్‌లు పూర్తి చేసినట్లు సమాచారం. అలాగే ప్రియాంక చోప్రా ఈ చిత్రానికి సుమారు రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే, ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించబడలేదు.
ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు ఈ చిత్రంలో కొత్త లుక్‌లో కనిపించనున్నారు.
అయితే, ప్రియాంక చోప్రా ప్రధాన హీరోయిన్ గా నటించనున్నారో లేదో ఇంకా స్పష్టత లేదు. కొన్ని రిపోర్ట్ ల ప్రకారం, ఆమె ప్రధాన పాత్రలో కాకుండా ఇతర కీలక పాత్రలో కనిపించవచ్చని సూచిస్తున్నారు.
ఇక ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగి హాలీవుడ్ కు వలస వెళ్లారు.. హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్‌లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు.
ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా.