ఓ సినిమా థియేటర్ రన్ పూర్తగానే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నుంచి సంపాదించిన ట్రేడ్ ఇన్ఫోతో మీడియాలో ఫైనల్ కలెక్షన్స్ వార్తలు వస్తూంటాయి. అయితే పుష్ప 2 నిర్మాతలు తమ సినిమాకు తక్కువ కలెక్షన్స్ వేస్తారనుకున్నారో మరేమో కానీ తామే ప్రకటించేసారు.
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప-2: ది రూల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. గతేడాది డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్ గా విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 1,871 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఈ మేరకు మేకర్స్ కలెక్షన్స్ ను అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
Shattering many records and creating new records, #Pushpa2TheRule stands tall as INDIAN CINEMA'S INDUSTRY HIT ❤️🔥#Pushpa2TheRule grosses 1871 CRORES WORLDWIDE 💥💥
— Pushpa (@PushpaMovie) February 18, 2025
RECORDS RAPA RAPAA 🔥#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/zR6H9BQzrT
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అని మేకర్స్ పేర్కొన్నారు. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజే రూ. 294 కోట్లు గ్రాస్ వసూలు చేసి మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ దాటింది. అనంతరం ఆరు రోజుల్లోనే రూ. వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం కొన్ని థియేటర్లతో పాటు నెట్‌ఫ్లిక్స్ లోనూ పుష్ప-2 స్ట్రీమింగ్ అవుతోంది.