
“హనుమంతుడిని నిందిస్తారా?” రాజమౌళిపై వానరసేన ఫిర్యాదు!
వారణాసి టైటిల్ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన ఒక కామెంట్… ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుకి దారి తీసింది!
ఈవెంట్ ప్రారంభంలో బిగ్ స్క్రీన్ ఆగిపోవడం… సాంకేతిక లోపం జరిగిన వెంటనే రాజమౌళి అన్న మాటలు—ఇప్పుడది భారీ వివాదానికి తెరలేపాయి. ఈ కామెంట్స్ హనుమంతుడిని అవమానించినట్లుగా ఉన్నాయని ఆరోపిస్తూ రాష్ట్రీయ వానరసేన నేరుగా హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రాజమౌళి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్‌ను కూడా పోలీసులకు అందజేశారు.
కానీ అసలు రాజమౌళి ఏమన్నాడు?
నవంబర్ 15 జరిగిన “వారణాసి” టైటిల్ లాంచ్‌లో భారీ తెరపై వీడియో ప్లే కాకపోయింది. కాసేపు స్క్రీన్ మొరాయించడంతో రాజమౌళి చిరాకు వ్యక్తం చేస్తూ— తన భార్య రమ హనుమంతుడి భక్తురాలని… తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ “అన్ని హనుమంతుడే నడిపిస్తాడు” అని చెబుతారని గుర్తు చేశారు. అయితే వెంటనే, “ఇలా ఎందుకు జరుగుతోంది? హనుమంతుడు ఇలా చేస్తాడా?” అన్నట్టు చేసిన వ్యాఖ్యే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.
సోషల్ మీడియాలో మొదలైన ఆగ్రహం…
“మీ టీమ్ తప్పు చేస్తే హనుమంతుడిని ఎందుకు నిందిస్తారు?” అంటూ భక్తులు రాజమౌళిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు.
ఇప్పుడు అదే ఆగ్రహం ఫిర్యాదు రూపంలో పోలీసుల చేతుల్లోకి చేరింది. ప్రస్తుతం పోలీసులు స్పందించకపోవడంతో, “ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందా?” అనే ఉత్కంఠ పెరుగుతోంది.
రాజమౌళి కామెంట్‌కు నిజంగానే కేసు నమోదవుతుందా?
వివాదం ఏ దిశలో మలుపు తిప్పుతుంది?
ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేస్తున్న ఈ ఘటనపై అందరి దృష్టి నిలిచింది.
