
‘ముసలి ము*** కొడుకు’.. బ్రహ్మానందాన్ని ఉద్దేసిస్తూ రాజేంద్రప్రసాద్ !
సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్ మరోసారి తన మాటలతో హాట్‌టాపిక్‌గా మారారు. ఓ సినిమా కార్యక్రమంలో టాలీవుడ్ లెజెండ్ బ్రహ్మానందంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. వేదికపై మొదట సరదాగా సాగిన మాటలు… ఒక్కసారిగా హద్దులు దాటేశాయి.
తాజాగా ‘స:కుటుంబానాం’ సినిమా ఈవెంట్‌కి బ్రహ్మానందం తో పాటు రాజేంద్రప్రసాద్ కూడా హాజరయ్యారు. బ్రహ్మానందం ప్రసంగం ముగిసిన తర్వాత మైక్ అందుకుని మాట్లాడుతూ మళ్లీ నోరు జారారు.
“డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం సబబు కాదు” అన్నారు.
దానికి వెంటనే బ్రహ్మానందం కూడా జోక్‌గా, “మేము కూడా మీ శిష్యులమే కదా” అని నవ్వుతూ చెప్పారు.
అక్కడే ట్విస్ట్!
దానికి రాజేంద్రప్రసాద్ వెంటనే,
“ముసలి ముండా కొడుకుని కదా నువ్వు!”
అని అనడంతో బ్రహ్మానందం షాక్ అవుతూ,
“ఎవరూ?”
అని అడిగారు.
తేరుకున్న రాజేంద్రప్రసాద్ వెంటనే మాటను మార్చుకుంటూ,
“నేనే… నేనే!”
అని సరి చేసుకునే ప్రయత్నం చేశారు.
కానీ అప్పటికే వీడియో క్లిప్ సోషల్ మీడియాలోకి పాకిపోయి… విమర్శల వర్షం మొదలైంది.
ఇది తొలిసారి కాదు. ‘రాబిన్ హుడ్’ ఈవెంట్లో క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై చేసిన కామెంట్లు, కమెడియన్ అలీపై ఉపయోగించిన అసభ్య పదజాలం – అన్నీ మళ్లీ రిమైండ్ అవుతున్నాయి.
సోషల్ మీడియా, సినీ వర్గాల్లో ఒకే డైలాగ్:
“సీనియర్ స్టార్‌గా స్టేజ్‌పై అంతకంటే కంట్రోల్ ఉండాలి కదా?”
రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు పదే పదే ఎందుకు ఇలా వివాదాన్ని రేపుతున్నాయి? అనేదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ చర్చ.
