సూపర్ స్టార్ రజనీకాంత్ – దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన “కూలీ” కు తెలుగు ప్రేక్షకుల మధ్య మంచి క్రేజ్ కనిపించింది. లోకేశ్ బ్రాండ్‌కు ఉన్న పాజిటివ్ బజ్ కూడా ఈ చిత్రానికి కలిసొచ్చింది. ఇప్పుడు సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ బయటకొచ్చాయి.

కూలీ 1వ వారం షేర్ (జీఎస్టీ & హైర్స్ సహా):

  • నిజాం : ₹16 కోట్లు
  • సీడెడ్ : ₹5.8 కోట్లు
  • ఉత్తరాంధ్ర (UA) : ₹5.1 కోట్లు
  • గుంటూరు : ₹3 కోట్లు
  • ఈస్ట్ : ₹2.85 కోట్లు
  • వెస్ట్ : ₹2.3 కోట్లు
  • కృష్ణా : ₹2.55 కోట్లు
  • నెల్లూరు : ₹1.45 కోట్లు

👉 మొత్తం AP/TG షేర్ : ₹39.05 కోట్లు
👉 AP/TG గ్రాస్ : ₹60 కోట్లు

బాక్స్ ఆఫీస్ అనాలిసిస్

టెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రారంభ వారం వసూళ్లు మంచి స్థాయిలో ఉండగా, వీకెండ్ తర్వాత భారీ డ్రాప్ కనిపించింది. ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ₹50 కోట్లు , ఇప్పటివరకు రికవరీ 78% వద్ద నిలిచింది.

మరిన్ని అవకాశాలు

సినిమాలో నాగార్జున పోషించిన “సైమన్” క్యారెక్టర్ సోషల్ మీడియాలో రీల్స్, వీడియోల ద్వారా వైరల్ అవుతోంది. ఈ హైప్ రెండవ వారాంతానికి బాక్స్ ఆఫీస్‌కి ఊతం ఇస్తే, డిస్ట్రిబ్యూటర్లకు లాభదాయకంగా మారే అవకాశం ఉంది.

, , , , , , , , ,
You may also like
Latest Posts from