

సినిమాలో హీరో, హీరోయిన్ ఎవరనేది ఎంత క్యూరియాసిటీ పెంచినా… స్టార్ హీరోలు సడన్‌గా గెస్ట్ రోల్‌లో ఎంట్రీ ఇస్తే థియేటర్స్‌లో హంగామా మామూలుగా ఉండదు! ఒక్క సీన్ లో కానీ, ఒక్క పాట లో కానీ, ఒక్క క్లైమాక్స్‌లో కానీ వారి స్పెషల్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో పులకరింత కలిగిస్తుంది. టాలీవుడ్లో ఇప్పటికే చాలా సార్లు ఈ “గెస్ట్ అపియరెన్స్ మ్యాజిక్” మాస్ ఆడియన్స్‌ను మత్తెక్కించిన ఉదాహరణలు ఉన్నాయి.
ఇక అదే ట్రెండ్‌ను తేజ సజ్జ ‘మిరాయ్’ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో లార్డ్ రాముడి అవతారంలో రానా దగ్గుబాటి ఎంట్రీ ఇస్తాడన్న బజ్‌తోనే అభిమానుల్లో ఎనర్జీ పరుగులు తీస్తోంది. సూపర్ హీరో కథకు డివోషనల్ టచ్ ఇస్తూ, రానా సాక్షాత్తూ రాముడిగా స్క్రీన్‌పై కనిపిస్తే థియేటర్స్‌లో జై శ్రీరాం నినాదాలు మార్మోగిపోవడం ఖాయం.
అంతేకాదు, రవితేజా–దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్స్ కూడా స్పెషల్ కెమియోలతో కనిపిస్తారన్న రూమర్లు హీట్‌ను మరింత పెంచేశాయి. ఇప్పటికే ప్రమోషన్స్‌లో తేజ చెప్పిన “ఫిల్మ్‌లో మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్‌లు ఉంటాయి” అన్న మాటలు హైప్‌ను రెట్టింపు చేశాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టి.జి. విశ్వప్రసాద్, తన కుమార్తె కృతి ప్రసాద్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘మిరాయ్’. తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, మంచు మనోజ్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
తేజ సజ్జ , మంచు మనోజ్ , శ్రియా శరణ్ , జయరామ్ , జగపతి బాబు , రిథికా నాయక్ కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను రికార్డు స్థాయిలో స్క్రీన్లపై రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
రానా రాముడిగా వస్తాడా? రవితేజా–దుల్కర్ క్యామియోలు నిజమా? అన్నది తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 12 వరకు ఆగాల్సిందే!