సినిమా వార్తలు

‘ధురంధ‌ర్’ గ‌ట్టిగా కొడతాడు అనుకుంటే…ఇలా

కొంద‌రు బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియని వ్యక్తుల నిజమైన కథను వెలికితీసే ప్ర‌య‌త్నం అని ఆదిత్యాధ‌ర్ తొలి నుంచి చెబుతున్నాడు. యూరి ఫేం మ‌రో అసాధార‌ణ క‌థ‌తో మన ముందుకు వచ్చారు. ధురంధర్ 5 డిసెంబర్ 2025న విడుద‌ల అయ్యింది. ఇది ర‌ణ్ వీర్ కి క‌చ్ఛితంగా గొప్ప పున‌రాగ‌మ‌నం అవుతుంద‌ని అంతా ఆశిస్తున్నారు. మరి ఎలా ఉందీ సినిమా అంటే..

ధురంధర్ రివ్యూలు అభిమానులకు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. రణవీర్ సింగ్ ఎంతో హైప్‌తో తెరపైకి వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ థియేటర్లలోకి వచ్చేసింది కానీ, ఆడియన్స్ నోళ్ళలో వినిపిస్తున్న పేర్లు మాత్రం వేరేవి. సోషల్ మీడియాలో, థియేటర్ల బయట టాక్ వింటే – “సినిమా పేరు రణవీర్‌దే కానీ, షో మొత్తాన్ని దొంగిలించిన వాళ్లు సపోర్టింగ్ క్యాస్ట్‌” అనడమే హాట్ టాపిక్‌గా మారింది.

పబ్లిక్ రిస్పాన్స్‌లో ఎక్కువగా ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ పేర్లు మారుమోగుతున్నాయి. వీళ్ల స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన సీన్ నుంచే థియేటర్లలో రెస్పాన్స్ మారిపోయిందని కామెంట్లు వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం లెంగ్తీగా, ఈదురుగాలిలా నెమ్మదిగా సాగిందనే ఫీల్ ఉన్నా, ఈ నలుగురి పెర్ఫార్మెన్స్‌తో నారేషన్‌కు ఒక్కసారిగా లైఫ్ వచ్చిందని యూజర్లు చెప్పుకుంటున్నారు.

అయినా కూడా పెర్ఫార్మెన్స్ ఒక్కటే సినిమాను పూర్తిగా కాపాడలేకపోయిందని చాలా మంది టాక్. రన్‌టైమ్ పై మాత్రం పబ్లిక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “చక్కగా ట్రిమ్ చేస్తే కుదిరిపోయే సినిమా… ఇంత పొడగించాల్సిన అవసరం ఏముంది?” అన్నట్టు రివ్యూలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. స్క్రీన్‌ప్లే చాలాచోట్ల స్లోగా, డల్‌గా ఉందని, దీంతో నారేషన్ డ్రాగ్ అయ్యిందని కామెంట్లు పెరుగుతున్నాయి.

రణవీర్ సింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను డీసెంట్‌గా, ఓకే అనేగా పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు. కానీ సారా అర్జున్‌తో ఆయన కెమిస్ట్రీ మాత్రం అసలు పనిచేయలేదనేది చాలా రివ్యూల్లో కనిపిస్తున్న ఒకే టోన్. ఎమోషనల్ కనెక్ట్ ముఖ్య సన్నివేశాల్లో పడలేదని, డైరెక్టర్ ఆదిత్య ధర్ సపోర్టింగ్ క్యాస్ట్‌ను బాగా వాడుకున్నా, మొత్తం సినిమాలో ఎమోషన్‌ను లెవల్‌కు తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యాడని ఆడియన్స్ అభిప్రాయం.

ముఖ్యంగా అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్‌ల పెర్ఫార్మెన్స్‌కి మాత్రం ఫుల్ మార్కులు పడుతున్నాయి. “రణవీర్ హీరో అయినా… యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఈ నలుగురు అతన్ని మించిపోయారు” అనే రీతిలో పోస్టులు, రీల్స్ వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరో ఉన్న సినిమా అయినా, స్టేజ్ మొత్తాన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ దక్కించుకున్న అరుదైన ఉదాహరణగా “ధురంధర్”ను చాలామంది ట్యాగ్ చేస్తున్నారు.

ఇప్పటివరకు వచ్చిన రివ్యూలు చూసుకుంటే టాక్ మిక్స్డ్‌గా ఉంది. స్టార్డమ్, భారీ క్యాస్ట్, మంచి యాక్షన్ ఉన్నా… లెంగ్త్, స్లో పేస్, ఎమోషనల్ డెప్త్ లేకపోవడం సినిమాకు హ్యాంగ్ అయిపోయినట్టు కనిపిస్తోంది. ఇక మిగతా గేమ్ మొత్తం ఫస్ట్ వీకెండ్ మీదే ఆధారపడింది. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కొంచెం పిక్ అయితే బాక్సాఫీస్ దగ్గర జారిపోకుండా నిలబడే ఛాన్స్ ఉంది, లేదంటే “అంత హంగామా ఏంది?” అన్న డౌట్‌తోనే ఆడియన్స్ థియేటర్‌కి వెళ్లే ముందు రెండుసార్లు ఆలోచించే టైమ్ వచ్చేసింది.

Similar Posts