
ముందుగానే ఓటీటిలో “మాస్ జాతర” , డేట్ ఫిక్స్ , ఎప్పుడంటే…
రిలీజ్‌కు ముందు రవితేజ ఫ్యాన్స్‌లో హై వోల్టేజ్ హైప్! “మాస్ జాతర” అంటేనే వింటేజ్ రవితేజ తిరిగి వస్తున్నాడు, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అనే బజ్‌తో థియేటర్ల వద్ద ఎనర్జీ పీక్‌లో. ట్రైలర్, సాంగ్స్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ – అన్నీ కలిసి సినిమా మీద ఎక్సపెక్టేషన్‌లను ఆకాశానికెత్తాయి.
కానీ… ప్రీమియర్ షోలతోనే తీర్పు వచ్చేసింది! ఇనానమస్ నెగటివ్ టాక్, ఫ్లాట్ స్క్రీన్‌ప్లే, అవుట్‌డేటెడ్ ట్రీట్‌మెంట్ – ఇలా మొదటి రోజుకే “మాస్ జాతర”ని మాస్ డిజాస్టర్ లిస్టులోకి పంపేశాయి. థియేటర్స్‌లో వారం కూడా నిలవకుండా బాక్సాఫీస్ నుండి ప్యాక్ అయ్యింది.
ఇప్పుడు టర్న్ OTTది!
డిజాస్టర్ టాక్ వచ్చినా… క్యూరియాసిటీ మాత్రం తగ్గలేదు! ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులు “సినిమా ఎంత దారుణంగా ఉందో చూడాలని” అంటూ OTT రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
మొదటగా నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 28న స్ట్రీమింగ్‌కు ప్లాన్ చేశారు. కానీ తాజా బజ్ ప్రకారం — రిలీజ్ ముందుకు రావొచ్చు! “మాస్ జాతర” థియేటర్స్‌లో క్రాష్ అయినా… OTTలో “క్యూరియాసిటీ హిట్” అయ్యే ఛాన్సెస్ బలంగా ఉన్నాయి.
