రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది. డెబ్యూ డైరెక్టర్ బోగవరపు భాను దర్శకత్వంలో, శ్రీలీల హీరోయిన్ గా రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే మాస్ సాంగ్, ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు.
అయితే, తాజా సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. ముఖ్యంగా టాకీ పార్ట్‌లో కొన్ని సీన్స్ మిగిలి ఉండగా, రెండు పాటల షూట్ కూడా పెండింగ్‌లోనే ఉంది. ఈ మధ్య ఫిలిం ఫెడరేషన్ ఉద్యోగుల సమ్మె కారణంగా ఫైనల్ షూట్, పోస్ట్-ప్రొడక్షన్ పనులు నిలిచిపోయాయి.
ఇలా పరిస్థితి ఉండటంతో మాస్ జాతర మరోసారి రిలీజ్ డేట్ మార్చుకోవాల్సి వస్తోంది. సెప్టెంబర్‌లో ఇప్పటికే పలు సినిమాలు లైన్లో ఉండటంతో, మాస్ రాజా మూవీని అక్టోబర్‌కు మార్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మాస్ మహారాజ్ రవితేజ మాస్ జాతర అంటూ రచ్చ రంబోలా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటి వరకు సాంగ్స్‌తో బొమ్మపై హైప్ క్రియేట్ చేస్తే.. రీసెంట్‌లో రిలీజ్ చేసిన టీజర్‌తో అన్నా మనం హిట్ కొట్టేయబోతున్నాం అంటూ ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు.
దీనికి రీజన్ మూవీలో మాస్ ఎలిమెంట్సే కాదు.. రవితేజ పోలీస్ గెటప్‌లో కనిపించడం కూడా పాజిటివ్ వైబ్స్ తెస్తోంది. మాస్ మహారాజ్ ఖాకీ చొక్కా ధరిస్తే హిట్ కొట్టేసినట్లేనన్న టాక్ టాలీవుడ్‌లో బలంగా ఉంది. ఇప్పుడు ఈ టీజర్ ఫ్యాన్స్‌లో హోప్స్ తెచ్చినట్లయ్యింది.