“ఒక హీరో పెద్ద డైరక్టర్‌ని నమ్మి సినిమా చేస్తే – అది ఆత్మవిశ్వాసం.
కానీ కథ లేకుండా నమ్మితే – అది అతి విశ్వాసం!”
అదే జరిగిందని చెబుతోంది ‘రెట్రో’ ఫలితం.
వెరైటీ కథలకు కేరాఫ్ అడ్రస్ అయిన సూర్య… ఈ సారి ప్రేక్షకులు తట్టుకోలేనంత భారీ డిజాస్టర్ ని ఇచ్చేసారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘రెట్రో’ సినిమా, గత గురువారం విడుదలైంది. కానీ ఫస్ట్ షో చూసిన ఫ్యాన్స్ నుంచే నెగెటివ్ టాక్ మొదలయ్యింది.
ఈ సినిమా చూస్తే… ప్రశ్నలే మిగిలాయి.
ఈ కథలో కొత్తదనం ఎక్కడ? కార్తీక్ టేకింగ్‌లో స్పార్క్ ఏమైందీ? సూర్య ఎందుకు ప్రొడ్యూసర్‌గా కూడా బరిలో దిగాడు? ఇవన్నీ అసలు సమాధానం దొరకని ప్రశ్నలుగా మారిపోయాయి. ఎక్కడా సరైన ఓపినింగ్స్ రాలేదు. తెలుగులో అయితే మరీ దారుణం.
సూర్య కెరీర్ చూస్తే, తాను ఎన్నో ప్రయోగాలు చేశాడు. ‘శివపుత్రుడు’ నుంచి నిన్న మొన్నచి ‘జై భీమ్’ దాకా – ఓ హీరో ఎలా కంటెంట్‌ను నమ్మి నడవాలో ఆయన చూపించారు. కానీ ఈ ‘రెట్రో’ మాత్రం ఆ చరిత్రలో ఒక డార్క్ స్పాట్‌గా మిగిలేలా ఉంది.