సమంత GQ మ్యాగజైన్ కవర్ పేజీపై స్టన్నింగ్ లుక్స్ దర్శనమిచ్చి తన ఫ్యాన్స్ కు పండగ చేసింది. గత కొంతకాలంగా అనారోగ్యతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. బ్రాండ్ ప్రమోషన్స్ తో సందడి చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా మ్యాగజైన్ కవర్ పేజీ పై స్టన్నింగ్ లుక్స్ తో అదుర్స్ అనిపించింది.

మరో ప్రక్క సమంత రెండో పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట సంచలనంగా మారింది. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్‌లో ఓ దర్శకుడితో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ దర్శకుడు మరెవ్వరో కాదు.. రాజు నిడుమోరు. సమంత నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు.

సమంత ఇటీవల నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

త్వరలోనే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.