‘విరూపాక్ష’ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత సాయి దుర్గా తేజ్ హీరోగా భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవల్‌లో ఓ మూవీ తెరకెక్కుతోంది. ‘సంబరాల ఏటిగట్టు’ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, గ్లింప్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి.
రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తుండగా… ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గ్రిప్పింగ్ స్టోరీ, భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో బలమైన ఎమోషన్స్, ఇంటెన్స్ డ్రామాగా మూవీ రూపొందుతోంది.
ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి నమ్మకంతో ఉన్న సాయి దుర్గ తేజ్, డైరెక్టర్ రోహిత్ KPకు విజువల్స్, యాక్షన్ డిజైన్ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు సమాచారం. అంటే ఇది సాధారణ మాస్ సినిమా కాదు — విజువల్ హై-స్కేల్ యాక్షన్ డ్రామా అనే టాక్ ఉంది.
తాజా ఇంటర్వ్యూలో తేజ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు — “ఈ సినిమా హాలీవుడ్ ఫిల్మ్ ‘300’ నుంచి ఇన్‌స్పైర్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి” అని చెప్పారు.
దీంతో ఈ చిత్రంపై హైప్ మరింత పెరిగింది. ‘హనుమాన్’ నిర్మాతలు నిరంజన్ రెడ్డి – చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. అలాగే జగపతి బాబు, అనన్య నాగల్లా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌తో తెలుగు స్క్రీన్‌పై న్యూ-ఏజ్ యాక్షన్ ఎపిక్ రాబోతుందా? ‘300’ తరహాలో విజువల్స్, యాక్షన్‌తో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందా? ఇండస్ట్రీలో ఇదే చర్చ.
ఈ మూవీలో సాయి తేజ్‌తో పాటు ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ విలన్ రోల్ చేస్తుండగా… భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఫేమస్ ఫైటర్ పీటర్ హెయిన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన స్పెషల్ వీడియోస్ భారీ హైప్ క్రియేట్ చేయగా… రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘అసుర ఆగమనం’ గ్లింప్స్ ఆ హైప్ పదింతలు చేసింది. మూవీ షూటింగ్ మేజర్ పార్ట్ కంప్లీట్ కాగా… మరో రెండు షెడ్యూల్స్ షూటింగ్ చేయాల్సి ఉంది.
మొత్తం మీద ‘సంబరాల యేటి గట్టు’పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. థియేటర్లలో ఎంత భారీ విజువల్ స్టార్మ్ వస్తుందో చూడాలి!

