ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’ మాస్ మాస్ లెవెల్లో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కి సంబంధించి ఓ పవర్ఫుల్ ఫైటింగ్ సీక్వెన్స్‌ను గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నారు. ఇదో లాంగ్ షెడ్యూల్. ఇంకా చెప్పాలంటే, ఈసారి ప్రశాంత్ నీల్ తన మైండ్‌గేమ్స్‌తో పాటు మ్యూజికల్ టచ్‌ను కూడా జోడించబోతున్నాడని తెలుస్తోంది.

ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటెమ్ సాంగ్ కూడా ఉండబోతోంది. ఆ సాంగ్‌కి గ్లామర్ యాడ్ చేస్తూ శ్రుతిహాసన్ ఎంటర్ అవుతుందన్న టాక్ ఫిలింనగర్ వర్గాల్లో హీటెక్కిస్తోంది.

ఇప్పటికే ‘సలార్’ లో ఆమె కీలక పాత్రలో కనిపించిందని తెలిసిందే. ‘సలార్ 2’ లోనూ శ్రుతి ఓ ప్రత్యేక శేడును పోషించనుంది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను ‘డ్రాగన్’ లో కూడా రిపీట్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్.

సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో పాటలకు అంతగా స్థానం ఉండదు. కానీ ఎన్టీఆర్ కోసం ఈసారి మాత్రం ఓ మ్యూజికల్ మాస్ షేడును జోడించనున్నట్టు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా గత చిత్రాలతో పోలిస్తే ఎక్కువ పాటలు ఉండబోతున్నాయంట. అందులో ఈ ఐటెమ్ సాంగ్ ఒకటి.

కథానాయికగా రుక్మిణీ వసంత్ నటిస్తున్న ఈ సినిమాలో ఆమె పాత్ర మాత్రం రొటీన్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. టిపికల్, డిఫరెంట్ షేడ్‌లో కనిపించబోతుంది.

అందుకే కమర్షియల్ మాస్ అప్పీల్ కోసం శ్రుతిహాసన్‌ను ఈ ఐటెమ్ సాంగ్ కోసం తీసుకున్నారని సమాచారం. టాకీ పార్ట్ మొత్తం పూర్తయిన తర్వాతే ఈ పాటను చిత్రీకరించనున్నారు.

, , , ,
You may also like
Latest Posts from