డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల‌తో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ అనే కొత్త యంగ్ స్టార్ తెలుగులో పుట్టుకొచ్చారు. అప్పటిదాకా చేసిన సినిమాలు ఒకెత్తు ..ఆ తర్వాత ఇమేజ్ మొత్తం మారిపోయింది. స్టార్ బోయ్ సిద్దూ అని అందరూ పొగిడేసారు. యూత్‌లో త‌న‌కంటూ ఓ క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో త‌న నుంచి ఇప్పుడు మ‌రో సినిమా వ‌స్తోందంటే ఆ రచ్చ ఎలా ఉండాలి.

నిన్న గురువారం సిద్దు కొత్త బొమ్మ ‘జాక్‌’ థియేటర్స్ లో దిగింది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. ఈ సినిమాకు కావ‌ల్సినంత బ‌జ్ రాలేద‌ు. వ‌రుస‌గా రెండు పెద్ద హిట్లు కొట్టిన ఓ హీరో సినిమా వ‌స్తోందంటే కనపడే హ‌డావుడి ఎక్కడా లేదు. దానికి తోడు.. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ సినిమా కదా అని ఫ్యామిలీలు ఎగబడలేదు.

సో ‘జాక్‌’ బుకింగ్స్ చాలా నీర‌సంగా క‌నిపించాయి. మార్నింగ్ షో పడ్డాక సీన్ మారుతుందిలే అని సర్ది చెప్పుకున్నారు. కానీ ఆదీ జరగలేదు. టిల్లు స్క్వేర్‌ సినిమా ముందు ఉన్న హ‌డావుడి, ఆ సంద‌డిలో పావు వంతు కూడా ఈ సినిమాపై లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. మొత్తం మీద ఈ సినిమా మొదటి రోజు ₹ 2.50 Cr కలెక్షన్స్ గ్రాస్ అందుకుందని సమాచారం. మ్యాట్నీ, ఈవినింగ్, నైట్ షోలులో అసలు ట్రెండే కనపడలేదు. మొత్తానికి సినిమా డిజాస్టర్ అనిపించుకుంది.

, , ,
You may also like
Latest Posts from