‘సంక్రాంతి వస్తున్నాం’ చిత్రం ఓటీటీ, డిజిటల్‌ రైట్స్‌ను జీ5/జీతెలుగు దక్కించుకున్న సంగతి తెలిసిందే. సోమవారం తన సోషల్‌మీడియాలో జీ తెలుగు ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్‌ పెట్టింది. ‘మళ్లీ సంక్రాంతికి వైబ్స్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ పోస్టు పెడుతూనే, ఓటీటీ కన్నా ముందే టీవీలో అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసి షాక్ ఇచ్చింది. ఆ వివరాలు చూద్దాం.

‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం మొదట టెలివిజన్‌ ప్రీమియర్‌గా అలరించనుంది. తొలుత అనుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకురావాలట.

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీని థియేటర్‌లో చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతుండటంతో ఓటీటీ విడుదల మరింత లేటు అయ్యే అవకాశం ఉందని టాక్‌ వినిపించింది. ఇప్పుడు మరో ట్విస్ట్‌ ఇస్తూ మొదట టెలివిజన్‌ ప్రీమియర్‌గా రానుంది.

ఓటీటీ కన్నా టెలివిజన్‌ ముందు ప్రసారం చేయడం వెనుక ఓ స్ట్రాటజీ ఉందని సమాాచరం. ‘సంక్రాంతి వస్తున్నాం’ పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కుటుంబమంతా కూర్చొని హాయిగా ఆస్వాదించే సినిమా. ఈ క్రమంలో ఓటీటీ కన్నా ముందే టీవీలో ప్రసారం చేస్తే, టీఆర్‌పీ రేటింగ్స్‌ బాగుంటాయన్నది టీమ్‌ ఆలోచనలా గా చెప్తున్నారు.

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam). వెంకటేశ్‌ (Venkatesh) కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు (గ్రాస్‌) పైగా వసూలు చేసింది.

ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. ఇందులో రమణ గోగుల ఆలపించిన ‘గోదారి గట్టు’ పాట ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రాప్‌ ట్రెండింగ్స్‌లో కొనసాగుతోంది.

, , , , ,
You may also like
Latest Posts from