
తళపతి విజయ్ కుమారుడి ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా,షాకింగ్ మేటర్!
తలపతి విజయ్ తనయుడు జేసన్ సాంజయ్ సినిమా రంగ ప్రవేశం చేశాడు కానీ ట్విస్ట్ ఏంటంటే — హీరోగా కాదు, డైరెక్టర్‌గా!తండ్రి లా యాక్షన్‌లో దూకడం కాదు, కెమెరా వెనక నుంచి స్టైలిష్‌గా తన ముద్ర వేయడానికి జేసన్ సిద్ధమయ్యాడు. అతడి తొలి చిత్రం పేరు “సిగ్మా”, హీరోగా సుందీప్ కిషన్, నిర్మాతగా లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్.
ఇవాళే విడుదలైన టైటిల్ పోస్టర్‌లో సుందీప్ కిషన్ నోటోళ్ళు, బంగారు గుట్టల మీద కూర్చుని కనిపించాడు – అంటే ఈసారి ట్రెజర్ హంట్ బ్యాక్‌డ్రాప్‌లో రచ్చ గ్యారంటీ! జేసన్ కథ చెప్పేది ఓ “లోన్ వుల్ఫ్” గురించి – సమాజం చెప్పిన రూల్స్‌ని తుడిచిపెట్టి, తన సొంత కలల కోసం పరిగెత్తే ఓ అండర్‌డాగ్ హీరో ప్రయాణం.

ఫారియా అబ్దుల్లా, రాజు సుందరం, అంబు థాసన్, యోగ్ జపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండా, మగలక్ష్మి సుధర్శనన్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో మెరిసనున్నారు. మ్యూజిక్ మాస్టర్ థమన్ ట్యూన్స్ అందిస్తుండగా, ఈ సినిమా తమిళ–తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలకు సిద్ధమవుతోంది.
సిగ్మా – విజయ్ కుమారుడి డెబ్యూ… సుందీప్ కిషన్ మ్యానర్‌యిజం… థమన్ బీట్‌స్… ఈ కాంబో ఏ రేంజ్‌లో బ్లాస్ట్ అవుతుందో చూడాలి!
