సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) హీరోగా కోలీవుడ్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన చిత్రం ‘సికందర్‌’ (Sikandar). రష్మిక హీరోయిన్. ఈద్‌ సందర్భంగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ.26 కోట్లు వసూలుచేసినట్లు ట్రేడ్‌ చెప్తోంది. అయితే ఆ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ ప్రారంభమయ్యింది.

సల్మాన్‌ గత చిత్రం ‘టైగర్‌ 3’తో పోలిస్తే ఈ కలెక్షన్స్‌ బాగా తక్కువ. రెండో రోజు రంజాన్ పండగ అడ్వాంటేజ్ ఉన్నా కూడా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా 20 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని బిలో పార్ లెవల్ లో హోల్డ్ ని చూపించింది.

దానికి తోడు సినిమా రిలీజ్ రోజునే మాస్టర్ ప్రింట్ లీక్ అవ్వడంతో గట్టి దెబ్బ తగలగా ఇటు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ అలాగే కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించకలేకపోయిందీ సినిమా.

సల్మాన్‌ స్టార్‌డమ్‌ కారణంగా ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం మాత్రం ఖాయమని అన్నా అదేమీ కనపడటం లేదు. విడుదలకు ముందే సినిమా లీక్‌ కావడం దీని కలెక్షన్లపై ప్రభావం పడుతోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

రిలీజ్ అవ్వకముందే.. శనివారం రాత్రి ‘సికందర్‌’ ఆన్‌లైన్‌లో లీక్‌ అయింది. చాలా వెబ్‌సైట్లలో శనివారం రాత్రి ‘సికందర్‌’ మూవీ ప్లే అయిందని, వెంటనే తొలగించాలని నిర్మాత సంబంధిత అధికారులను కోరారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది.

, ,
You may also like
Latest Posts from