ప్రముఖ టాలీవుడ్ సింగర్ కల్పన (Playback Singer Kalpana)వార్తలు నిన్న సాయింత్రం నుంచి వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులను టెన్షన్ పడుతున్నాయి. అయితే మొత్తానికి కల్పన ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందులో తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని తెలిపింది. తాను సుసైడ్ అటెంప్ట్ చేయలేదని, తన కూతురితో జరిగిన మనస్పర్థల కారణంగా నిద్ర లేకపోవడంతో అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వివరణ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరి తప్పులేదని కల్పన తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ సంఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సింగర్ కల్పనా రాఘవేంద్ర గత 5 ఏండ్లుగా తన భర్త ప్రసాద్‌తో కలిసి హైదరాబాద్‌లోని ఒక విల్లాలో నివసిస్తున్నారు. ఇటీవల ఆమె కుమార్తె, కల్పనకి, ప్రసాద్‌కి చదువు విషయంలో గొడవ జరిగింది. ఈ విషయంలోనే కల్పన ఒత్తిడికి గురి అయ్యింది. అయితే ఈ విషయం జరిగిన అనంతరం కల్పన హైదరాబాద్‌కి తిరిగివచ్చారు. అయితే కల్పన హైదరాబాద్‌కి వచ్చిన అనంతరం ఆమె భర్త ఫోన్ చేయగా.. కల్పన నుంచి స్పందన లేదు.
దీంతో ఆందోళన చెందిన ఆయన కల్పన ఉంటున్న ఆపార్ట్‌మెంట్ సభ్యులకు సమాచారం అందించాడు. అయితే ఆపార్ట్‌మెంట్ సభ్యులు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే కల్పన ఉన్న ప్లాట్ దగ్గరికి వచ్చిన పోలీసులు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే తాళం తెరుచుకోకపోవడంతో.. వెనుక వైపు ఉన్న కిచెన్ బాల్కానీ నుంచి లోపలికి ప్రవేశించి, బెడ్ రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.