మోహన్ బాబు పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఖమ్మం జిల్లా ఏదులాపురం గ్రామ పంచాయితీ పరిధిలోని ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి…ఖమ్మం జిల్లా కలెక్టర్, ఏసీపీకి ఫిర్యాదు చేశారు. సినీ నటి, స్వర్గీయ సౌందర్యకు శంషాబాద్ పరిధిలోని జల్‌పల్లి గ్రామంలో 6 ఎకరాల భూమి ఉంది.
ఆమెను ఆ భూమి విక్రయించమని మోహన్ బాబు అడిగారు. అందుకు సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ నిరాకరించారు, ఆ క్రమంలో ఇద్దరినీ మోహన్ బాబు హత్య చేయించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సౌందర్య భర్త రఘు స్పందించారు.
రఘు మాట్లాడుతూ…. గత కొద్దిరోజులుగా హైదరాబాదులోని ఒక ప్రాపర్టీ కి సంబంధించి మోహన్ బాబు సౌందర్య పేర్లను అనవసరంగా ప్రస్తావిస్తున్నారు. ప్రాపర్టీ గురించి ఇవన్నీ ఆధారాలు లేని వార్తలే. నా భార్యకు చెందిన ఎలాంటి ఆస్తిని మోహన్ బాబు ఇల్లీగల్ గా స్వాధీనం చేసుకోలేదు.
నాకు తెలిసినంతవరకు ఆయనకు, మాకు ఎలాంటి ఆస్తి లావాదేవీలు కూడా లేవు. సౌందర్య మరణించిన తర్వాత కూడా నాకు మోహన్ బాబు గారితో 25 సంవత్సరాల పైనుంచి మంచి స్నేహం ఉంది.
అలాగే నా భార్య, అత్తగారు, బావమరిది ఎప్పుడూ ఆయనతో మంచిగా ఉండేవారు. ఈ విషయంలో నేను ఆయనకు అండగా నిలుస్తూ అసలు విషయం ఏంటో చెప్పాలనుకున్నాను. మాకు మోహన్ బాబు కుటుంబానికి ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేవు ఇవి కచ్చితంగా ఆధారం లేని వార్తలే. కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ ప్రచురించకండి అంటూ ఆయన ఒక లేఖ విడుదల చేశారు.
ఇక సౌందర్య మరణానికి ముందు రఘు జిఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని వివాహం చేసుకున్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో ఆమె కన్నుమూశారు.