మొదటినుంచీ శ్రీ విష్ణు కాస్త డిఫరెంట్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు. గతేడాది ‘స్వాగ్’ అనే ప్రయోగాత్మక సినిమా చేశాడు. కానీ ఇది ఆడలేదు. దీంతో తనకు కలిసొచ్చిన కామెడీనే మళ్లీ నమ్ముకున్నాడు. అలా చేసిన మూవీ ‘సింగిల్’. మే 9న రిలీజ్ కాబోతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ సినిమా ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ ని ట్టి చూస్తే.. సింగిల్ గా ఉండే శ్రీ విష్ణు జీవితంలోకి ఇద్దరమ్మాయిలు వస్తారు. తర్వాత వాళ్లతో ప్రేమ, రొమాన్స్, గొడవలు.. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.
ట్రైలర్ లో కామెడీ బాగుంది. జోకులు బాగానే పేలాయి. చూస్తుంటే శ్రీ విష్ణు మరో హిట్ కొడతాడేమో అనిపిస్తుంది. రీసెంట్ గా వైరల్ అయిన బుల్లిరాజు అలియాస్ రేవంత్ ఈ సినిమాలోనూ నటించాడు. గీతా ఆర్ట్స్ సంస్థ దీన్ని నిర్మించగా.. కార్తీక్ రాజ్ దర్శకుడు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లు.