శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె నుంచి సరైన విజయాలు రావడం లేదు. ఈ క్రమంలో, తన డేట్స్ విషయంలో ఆమె చూపుతున్న నిర్లక్ష్యం ఇప్పుడు ఆమె కెరీర్‌కే చేటు తెచ్చేలా ఉంది. ఒకవైపు శ్రీలీల క్రేజ్ ఉన్నా హిట్ శాతం తక్కువ కావడం, మరోవైపు కొత్తదనం కోరుకుంటున్న ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆమె వెనుకబడిందనే చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉండగా, ఇటీవల విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, దాని హీరోయిన్ భాగ్యశ్రీకి మాత్రం అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ఆమె గ్లామర్, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కారణంగానే ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే రామ్‌తో ఒక సినిమా చేస్తుండగానే, విజయ్ దేవరకొండ సరసన మరో అవకాశం దక్కించుకుంది. త్వరలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
తాజాగా, ఈ క్రమంలోనే భాగ్యశ్రీకి బంపర్ ఆఫర్ తగిలింది. అఖిల్ అక్కినేని హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సినిమాలో మొదట శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే, డేట్స్ విషయంలో శ్రీలీల నుంచి సరైన సహకారం లేకపోవడంతో, చిత్రబృందం ఆమెకు గుడ్‌బై చెప్పేసింది. ఈ వార్త బయటకు రాగానే, ఆ ప్లేస్‌లోకి ఎవర్ని తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. ఊహించని విధంగా, ఆ అదృష్టం భాగ్యశ్రీని వరించింది.
శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీని తీసుకున్నారని తెలియగానే అఖిల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల ఇప్పటికే చాలా సినిమాలు చేసి, పెద్దగా హిట్స్ లేకపోవడం, పైగా ఆమెలో కొత్తదనం లేకపోవడంతో మార్పును కోరుకుంటున్నారు. భాగ్యశ్రీ ఇప్పటికి ఒక్క సినిమానే చేసి, తాజాగా రెండు పెద్ద ప్రాజెక్టులు చేతిలో ఉండటంతో, ఆమెపై ప్రేక్షకులకు తాజాదనం, ఆసక్తి ఉన్నాయి.
అఖిల్ సినిమా విడుదలయ్యే సమయానికి భాగ్యశ్రీ మరో రెండు సినిమాలు చేసి ఉండటంతో, ఆమె కెరీర్‌కు ఇది ఒక మైలురాయి అవుతుందని, అఖిల్ అభిమానులు ఆమె ఒక మంచి ఛాయిస్ అని బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమాతో భాగ్యశ్రీ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందేమో చూడాలి.