“సినిమా ఇండస్ట్రీ ఆశ్చర్యకరమైనది. కొన్ని సార్లు అవి చేసే ప్రాజెక్టులు జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తిస్తాయి. కమర్షియల్ విజయాలతో వెళ్తున్న యాక్షన్ హీరో, హఠాత్తుగా ఒక సైలెంట్ క్రైమ్ థ్రిల్లర్ రీమేక్ చేస్తూంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అది కూడా రాజశేఖర్ వంటి హీరో చేయగా డిజాస్టర్ అయ్యిన సినిమా రీమేక్ ని !”
గదర్ 2, జాట్ లాంటి పక్కా మాస్ బ్లాక్‌బస్టర్లతో వెనుక తిరిగి చూడని స్పీడ్‌లో ఉన్న సన్నీ డియోల్, ఇప్పుడు మలయాళ క్రైమ్ డ్రామా ‘జోసెఫ్’ యొక్క హిందీ రీమేక్ ‘సూర్య’ తో బరిలోకి దిగుతున్నాడు. ఇది వింటే ఇండస్ట్రీకి కూడా చిన్న షాక్‌నే.
ఈ జోసెఫ్ మరేదో కాదు…రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘శేఖర్’ కు మూల సినిమా, జీవిత దర్శకత్వంలో తెరకెక్కింది. కానీ సినిమాని ఎవ్వరికి గుర్తులేనంత డిజాస్టర్ అయ్యింది. ఓటిటిలో కూడా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఎవరూ కొనలేదు.
ఇక ఈ కథ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. తన మాజీ భార్య ఓ రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోతే అదే ఘటన వెనక దాగిన గొప్ప కుట్రను బయటకు తీస్తాడు. స్వయంగా ఇన్విస్టిగేట్ చేస్తూ … చివరికి అది ఒక పెద్ద మెడికల్ మాఫియాని బయిటపెడతాడు. నిజం ప్రపంచానికి తెలియాలి అనే ఒక్క ఆలోచనతో… ఎవరూ చేసే సాహసం చేస్తాడు. ఫైనల్ క్లైమాక్స్ మాత్రం నిజంగా షాకింగ్.
ఇప్పుడు అదే కథను సన్నీ డియోల్ చేస్తుండటమే అసలు షాక్. డైరెక్టర్ ఎంసి పద్మకుమార్ – ఒరిజినల్ ‘జోసెఫ్’ చిత్రాన్ని తెరకెక్కించినవారే దీన్ని డైరక్ట్ చేస్తున్నారు..
ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్లకి ఓ ప్లస్ ఉంది. తక్కువ బడ్జెట్, తక్కువ రోజుల్లో షూటింగ్, పరిమిత లొకేషన్లు, కానీ కథ బలంగా ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి అనే నమ్మకం.