సినీ నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియా రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ చౌదరితో కలిసి ఆమె ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. అంతేకాదు పీలింగ్స్ విత్ సుప్రీత అనే టాక్ షో చేస్తోంది. తాజాగా హోలీ సందర్భంగా అభిమానులకు ఆమె శుభాకాంక్షలు తెలిపింది. దీంతోపాటు క్షమాపణలు కూడా కోరింది.
సురేఖ క్షమాపణలు చెప్పడానికి ఓ ముఖ్య కారణమే ఉంది. బెట్టింగ్ యాప్ లను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్న వారిపై గత కొన్ని రోజులుగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో సుప్రీత స్పందిస్తూ… తాను కూడా తెలిసో, తెలియకో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశానని చెప్పింది. ఇక నుంచి అలాంటి ప్రమోషన్లు చేయనని… మీరు కూడా బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని కోరింది. ఎవరూ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయవద్దని హితవు పలికింది.
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు తనను క్షమించాలని సుప్రీత కోరింది. బెట్టింగ్ యాప్స్ ను అందరూ వెంటనే డిలీట్ చేయాలని చెప్పింది. సోషల్ మీడియాలో కూడా వాటిని ఫాలో కావద్దని కోరింది.